హన్మకొండలో కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..

Published : Dec 22, 2023, 07:19 AM IST
హన్మకొండలో కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..

సారాంశం

అన్నాదమ్ముల కుటుంబాలు వేములవాడ దైవదర్శనానికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ అతి వేగంగా వచ్చి కొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకుల కుప్పగా మారిపోయింది. 

హన్మకొండ : తెలంగాణలోని హన్మకొండలో శుక్రవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం శాంతినగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు ఇసుక లారీ  ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఎంజిఎంకి తరలించారు. 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వేములవాడ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. అన్నాదమ్ముల కుటుంబాలు వేములవాడ దైవదర్శనానికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ అతి వేగంగా వచ్చి కొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకుల కుప్పగా మారిపోయింది.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Free Winter: ఈసారి చలి లేనట్టే.. శీతాకాలంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా?
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలోకి ఎప్పుడంటే?