డిసెంబర్‌ నాటికి ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం: మంత్రి కేటీఆర్

Published : Apr 13, 2022, 11:45 AM ISTUpdated : Apr 13, 2022, 12:03 PM IST
డిసెంబర్‌ నాటికి ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం: మంత్రి కేటీఆర్

సారాంశం

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. అంబేద్కర్ విగ్రహ నమూనాలను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు.

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ పై  125 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR చెప్పారు.Hyderabad లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ నమూనాను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

 Tank Bund  వద్ద  Ambedkar విగ్రహం ఏర్పాటుకు పనులు పూర్తయ్యాయన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని మాటల్లో కాదు చేతల్లో తమ ప్రభుత్వం చూపుతుందన్నారు.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టుగా  కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహం తయారు అవుతుందన్నారు. అయితే ఈ విగ్రహం తయారీని ప్రజా ప్రతినిధులు పరిశీలించనున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. ప్రపంచంంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా ఈ విగ్రహం చరిత్ర సృష్టించనుందని కేటీఆర్ చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే వారికి అంబేద్కర్ ఆదర్శమన్నారు. అంబేదర్క్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణను సాధించుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.

ట్యాంక్ బండ్ వద్ద 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు రూ. 1400 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబందించి రాష్ట్రప్రభుత్వం జీవో నెంబర్ 2ను విడుదల చేసింది.  అంబేద్కర్ విగ్రహంతో పాటు అంబేదర్కర్ పార్క్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుంది.ఈ విగ్రహం ఏర్పాటుకు గాను 791 టన్నుల స్టీల్ ను ఉపయోగించనున్నారు. అంతేకాదు 96 మెట్రిక్ టన్ను ఇత్తడిని ఉపయోగించనున్నారు. ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహలను ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఇందులో భాగంగానే  అంబేద్కర్ విగ్రహన్ని 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనుంది.  పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహన్ని రాత్రికి రాత్రే తొలగించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు పంజాగుట్టలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయమై హైద్రాబాద్, ఢిల్లీ కేంద్రంగా హనుమంతరావు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.

 ఈ విషయమై తనకు అండగా ఉండాలని వి. హనుమంతరావు పార్టీ నాయకత్వాన్ని కోరారు. పార్టీ కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించింది. అయితే ఈ విషయమై పార్టీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదని కూడా హనుమంతరావు అసంతృప్తితో ఉన్నారు.పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే తనకు మైలేజీ వస్తుందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారని కూడా ఇటీవలనే హనుమంతరావు మీడియాతో బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?