
నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం అమెరికా రాయబార కార్యాలయానికి నకిలీ పత్రాలు సమర్పించినందుకు గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫేక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్లు అందజేసినందుకు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసులు నమోదైన వారిలో స్టూడెంట్లు, విద్యా సేవల సలహాదారులు, సాఫ్ట్ వేర్ శిక్షణా సంస్థ నిర్వా హకులు ఉన్నారు. వీరు అంతా ఓ సందర్భంలో తాము అందజేసినవి ఫేక్ డాక్యుమెంట్లని అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. US ఎంబసీ అధికారుల ఫిర్యా దుల మేరకు మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా అనేక మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని చైతన్యపురికి చెందిన ఎడ్యు కేషన్ కన్సల్టెన్సీ ఆపరేటర్ కపిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరిని అరెస్టు చేశారో తెలంగాణ పోలీసులకు తెలియదని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.
ఏపీ, తెలంగాణ, కేరళ తో పాటు దేశ వ్యా ప్తంగా పలువురు నిందితులను పట్టుకుట్టున్నట్లు ఢిల్లీకి చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆ మీడియా సంస్థకు తెలిపారు. ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని చాణక్యపురి పీఎస్ అధికారి చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిందితులపై అమెరికా రాయబార కార్యాలయంలోని అసిస్టెంట్ ప్రాంతీయ భద్రతా అధికారి, పరిశోధకుడు కోరి ఎం థామస్ మార్చి 24న మొదటి ఫిర్యాదును అందజేశారు.
ఇందులో ముషిరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఉండే ఎం వెంకట్ రెడ్డి నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆయన 5 లక్షల నెలవారీ ఆదాయం ఉన్న టెరాసాఫ్ట్ సొల్యూ షన్స్ కు తాను సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తున్నాని పేర్కొన్నారు. అపాయింట్మెంట్ లెటర్, రికమండేషన్ లెటర్, పే స్టబ్స్ అందజేశారు. తన తండ్రి రూ. 25 లక్షల రుణం తీసుకున్నట్లు బ్యాం కు నుండి లోన్ లెటర్ ను అందించారు. తండ్రి పొదుపు ఖాతాలో రూ.35 లక్షలు ఉన్నట్లు బ్యాం కు లేఖను సమర్పిం చాడు. ఓయూ డిగ్రీ సర్టిఫిర్టికెట్లు కాకుండా ఆయన ఇంజినీరింగ్ కాలేజీల నుంచి మూడు సిఫార్సు లేఖలను అందించారు. అయితే యూఎస్ ఎంబసీలో వీసా ఇంటర్వ్యూ లో వెంకట్ తను మోసపూరిత మార్గాల ద్వారా పొందినట్లు అంగీకరించాడు.
హన్మకొండకు చెందిన సాయి చందు రెడ్డి సాఫ్ట్ టెక్ కంప్యూటర్స్ లో సెప్టెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పైథాన్ కోర్సుతో మెషిన్ లెర్నింగ్ పూర్తి చేసినట్లు నాన్ ఇమిగ్రెంట్ US స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు ఆ సంస్థ ద్వారా మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. రూ. 30 లక్షలు బ్యాలెన్స్ గా చూపుతూ.. తన తండ్రి పేరు మీద బ్యాంకు బ్యాలెన్స్ సర్టిఫిర్టికెట్ తో పాటు రూ. 30 లక్షలకు బ్యాంకు రుణం మంజూరు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే వీసా ఇంటర్వ్యూ లో ఆయన సాఫ్ట్ టెక్ కంప్యూటర్స్ లో క్లాసులకు హాజరుకాలేదని ఒప్పుకున్నారు. ఇలా చాలా మంది ఫేక్ డాక్యుమెంట్లతో వీసాకు దరఖాస్తు చేశారు. వారిని గుర్తించి యూఎస్ ఎంబసీ అధికారులు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై కేసులు నమోదు అయ్యాయి.