Hyderabad Crime: అపార్ట్ మెంట్ టెర్రస్ పై 12ఏళ్ల బాలిక మృతదేహం... హత్యాచారమేనా?

Arun Kumar P   | Asianet News
Published : May 14, 2022, 12:38 PM ISTUpdated : May 14, 2022, 12:43 PM IST
Hyderabad Crime: అపార్ట్ మెంట్ టెర్రస్ పై 12ఏళ్ల బాలిక మృతదేహం... హత్యాచారమేనా?

సారాంశం

అభం శుభం పన్నెండేళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో అపార్ట్ మెంట్ టెర్రస్ పై లభించింది. ఈ దారుణం హైదరాబాద్ లోని మియాపూర్ గోకుల్ అపార్ట్ మెంట్స్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్: అపార్ట్ మెంట్ టెరస్ పై అనుమాస్పద స్థితిలో అభంశుభం తెలియని పన్నెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ దుర్ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మియాపూర్ లో వెలుగుచూసింది. బాలికపై అత్చచారం జరిపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బాలిక మృతికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఓ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి భార్య, 12 ఏళ్ల కూతురితో కలిసి వుంటున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చిన్నారి ఇంటివద్దే వుంటోంది. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ చిన్నారి అపార్ట్ మెంట్ టెర్రస్ పై ఉరేసుకున్న స్థితిలో మృతిచెంది కనిపించింది. 

తమ కూతురు కనిపించకపోయేసరికి కంగారుపడిపోయిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరకు అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి వెళ్లగా పెంట్ హౌస్ ఇనుపమెట్లకు చిన్నారి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేసారు. 

చిన్నారిని తెలిసినవారే టెర్రస్ పైకి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడి ఎక్కడ విషయం బయటపెడుతుందోనని హత్యచేసి వుంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో రక్తపు మరకలు చిన్నారిపై అత్యాచారం జరిగిందనే అనుమానానికి బలం చేకూరుస్తుంది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. 

ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తేలనుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇంత చిన్న వయసులో బాలికకు అసలు ఆత్మహత్య చేసుకునే ఆలోచనే రాదని... ముమ్మాటికీ ఇది హత్యేనని అనుమానిస్తున్నారు. దీంతో బాలికకు ఆత్మహత్య చేసుకునేంత  సమస్యలు ఏమయినా వున్నాయా... లేక అందరూ అనుమానిస్తున్నట్లుగానే అత్యాచారం జరిపి హత్యచేసారా అన్న  కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే సిద్దిపేట జిల్లాలో ఓ చిన్నారిని మాయమాటలతో లోబర్చుకున్న ఓ కీచకుడు. అమాయకురాలైన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి నమ్మించి గత ఏడాదికాలంగా అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భందాల్చింది.  

 సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ఓ బాలిక (15) పదోతరగతి చదువుతోంది. ఈ బాలిక ఇంటిపక్కనే ఇంటర్మీడియట్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా వుంటున్నాడో యువకుడు. జులాయిగా తిరుగుతున్న ఇతడి కన్న ఇంటిపక్కన బాలికపై పడింది. స్కూల్ కి వెళ్లే సమయంలో, ఇంట్లోంచి బయటకు వచ్చినపుడు బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అతడి మాయమాటలు బాలిక నమ్మి మోసపోయింది. బాలికకు తనపై పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత మరింత మభ్యపెట్టి శారీరకంగా కూడా దగ్గరయ్యాడు. ఇలా గత ఏడాది కాలంగా బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడిని గుడ్డిగా నమ్మిన బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 

అయితే ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి గర్భవతిగా తేల్చారు. దీంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా తనపై ఏడాదిగా ఎదురింటి యువకుడు చేస్తున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది. 


 
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu