మూడు రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహంతో కొడుకు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..

Published : May 14, 2022, 12:35 PM IST
మూడు రోజులుగా ఇంట్లోనే తల్లి మృతదేహంతో కొడుకు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..

సారాంశం

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు తన తల్లి మృతదేహంతో పాటు వారి ఫ్లాట్‌లో మూడు రోజులు గడిపాడు. అయితే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు తన తల్లి మృతదేహంతో పాటు వారి ఫ్లాట్‌లో మూడు రోజులు గడిపాడు. అయితే ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వివరాలు.. మల్కాజ్‌గిరి విష్ణుపురి కాలనీలోని మైత్రినివాస్ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఫ్లాట్‌లోకి వెళ్లి పరిశీలించారు. 

ఆ ఫ్లాట్‌లో పోలీసులకు 50 ఏళ్ల విజయ మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో.. విజయ మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో ఫ్లాట్‌లో విజయ కొడుకు సాయికృష్ణ కూడా ఫ్లాట్‌లోనే ఉన్నాడు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఆమె కుమారుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

అయితే సాయికృష్ణ  మానసిక స్థితి బాగోలేదని.. విజయకు, సాయికృష్ణకు మధ్య తరుచూ గొడవ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. విజయను కొడుకు సాయికృష్ణ హత్యచేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్