
వీకెండ్ లో దక్షిణ మధ్య రైల్వే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది. మే 14,15వ తేదీన రెండు రోజుల్లో దాదాపు 34 ఎంఎంటీఎస్ సేవలు ఆపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
పోలీస్ కొలువులకు దరఖాస్తు గడువు పొడిగించేది లేదు : టీఎస్ ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు
ప్రతీ రోజు 76 ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతుంటాయి. అయితే ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయింతో 34 రైలు రద్దు అయ్యాయిని నిర్ధారణ అవుతోంది. ఏ ఏ రైళ్లు రద్దు అవుతున్నాయో సిటీలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతామని ఆ రైల్వే సంస్థ ప్రకటించింది.
సరూర్‌నగర్‌లో తల్లి హత్య కేసులో ట్విస్ట్ : అమ్మాయిల కోసం స్కెచ్ గీసిన శివ... సాయిని పావుని చేసి
మొత్తంగా లింగంపల్లి - హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు నిలిచిపోయాయి. ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య 14 రైళ్లు ఆగిపోనున్నాయి. అలాగే సికింద్రాబాద్ - లింగంపల్లి మధ్య రెండు రైళ్లు రద్దు చేశారు. కాగా శుక్రవారం కూడా 6 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పాక్షికంగా నిలిపివేసింది. లింగంపల్లి వరకూ పోకుండా లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే సర్వీసులను హఫీజ్‌పేట్ వరకే నడిపింది.