హైదరాబాద్‌లో థియేటర్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో చిక్కుకున్న గర్భిణీ సహా 12 మంది..

Published : Jul 05, 2023, 11:35 AM ISTUpdated : Jul 05, 2023, 11:55 AM IST
హైదరాబాద్‌లో థియేటర్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో చిక్కుకున్న గర్భిణీ సహా 12 మంది..

సారాంశం

హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. థియేటర్‌ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్‌లో గర్భిణి సహా 12 మంది చిక్కుకుపోయారు.

హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. థియేటర్‌ కాంప్లెక్స్‌లోని లిఫ్ట్‌లో గర్భిణి సహా 12 మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం రాత్రి మూసారాంబాగ్‌లోని పీవీఆర్ మాల్‌లోని లిఫ్ట్‌‌ ఒక్కసారిగా నిలిచిపోయింది. అయితే అందులో ఒక గర్భిణీతో సహా 12 మంది చిక్కుపోయారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న మలక్‌పేట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Also Read: అసంతృప్తిలో బండి సంజయ్?.. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు విముఖత!!

మలక్‌పేట టీమ్ ఫైర్ ఆఫీసర్ ఎండీ ముస్తఫా, లీడింగ్ ఫైర్‌మెన్ అంజి రెడ్డి‌లు.. లిఫ్ట్‌లో చిక్కుకున్న గర్భిణీతో సహా 12 మందిని రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?