మటన్ బిర్యాని తిని.. అస్వస్థతకు గురైన 12 మంది.. హోటల్ సీజ్..

Published : Mar 24, 2023, 12:23 PM IST
మటన్ బిర్యాని తిని.. అస్వస్థతకు గురైన 12 మంది.. హోటల్ సీజ్..

సారాంశం

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మటన్ బిర్యానీ తిని 12 మంది అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ హోటల్లో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు.  దీంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం రాత్రి హైదరాబాద్ సనత్ నగర్ లోని మాషా అల్లా అనే హోటల్లో బిర్యానీ తినడానికి కొంతమంది వెళ్లారు.  ఇలా వెళ్లిన వారిలో మటన్ బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిహెచ్ఎంసి ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ రేణుకలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్లో తనిఖీలు చేపట్టారు.

అస్వస్థతకు సంబంధించిన ఫిర్యాదు మేరకు హోటల్లో తనిఖీలు నిర్వహించి అక్కడ వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు.. వాటి శాంపిలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మాషా అల్లా హోటలను సీజ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం హోటల్లో సేకరించిన ఆహార పదార్థాల శాంతిలను పరీక్ష నిమిత్తం పంపించామని..  వాటిలో ఏమైనా లోపాలు ఉన్నట్లుగా తేలితే నిర్వాహకులపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక బుధవారం రాత్రి ఈ హోటల్లో ఆహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన 12 మందిలో ఆరుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  మరో ఆరుగురికి చికిత్స కొనసాగుతోంది. 

హైదరాబాద్ లో ఇద్దరు స్కూలు విద్యార్థినులు అదృశ్యం.. ఫేర్వెల్ పార్టీకి వెళ్లి ఒకరు, ఇంట్లోనుంచి మరొకరు...

ఇదిలా ఉండగా,  నాలుగు రోజుల క్రితం మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లోని ఓ మండి హోటల్లో బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్,  మహేందర్ అనే ముగ్గురు స్నేహితులు 18వ తేదీ రాత్రి ఇక్కడినుంచి బిర్యానీ పార్సిల్ తీసుకువెళ్లారు. అదే రోజు నర్సాపూర్ కే చెందిన అజీజ్ అనే వ్యక్తి మరో ఆరుగురు స్నేహితులతో కలిసి అదే మండి హోటల్ కు వచ్చి ఆహారం తిన్నాడు.  ఇలా తిన్న వీరందరూ అస్వస్థతకు గురై గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరారు.

నర్సాపూర్ కే చెందిన మహేష్, షకీల్, నాని కూడా ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్ లోని మన్నత్ అరేబియన్ హోట్ నుంచి శాంపిల్స్ సేకరించినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత తెలిపారు .

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే