వనమా రాఘవేందర్‌పై 12 కేసులు: కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పణ

Published : Jan 10, 2022, 03:46 PM ISTUpdated : Jan 10, 2022, 03:52 PM IST
వనమా రాఘవేందర్‌పై 12 కేసులు: కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పణ

సారాంశం

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంటకేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ పై 12 కేసులున్నాయని ఖమ్మం పోలీసులు తెలిపారు. ఈ మేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. 

ఖమ్మం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ రావుపై 12 కేసులున్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  కోర్టుకు Khammam పోలీసులు  Vanama Raghavendra Rao  రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని Palwancha  పాత బజారులో Ramakrishna కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకొంది.ఈ కేసులో వనమా రాఘవేందర్ ను  ఈ నెల 7వ తేదీ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు ఆయనను రిమాండ్ కు తరలించారు.

Remand Report లో వనమా రాఘవేందర్ పై ఉన్న కేసులను కూడా పోలీసులు ప్రస్తావించారు. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ ముందస్తు బెయిల్ పొందారని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవిపల్లి పోలీసు స్టేషన్‌లలో  కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.  పాల్వంచ టౌన్‌లో అయిదు కేసులు, మరో రెండు కేసులు పాల్వంచ రూరల్‌లో ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదే విధంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీ దేవిపల్లిలో ఒక్క కేసు నమోదయిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. తాజాగా పాల్వంచ టౌన్‌లో మరో కేసు నమోదయిందని చెప్పారు. మొత్తం 12 కేసులు రాఘవపై నమోదు అయ్యాయని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. 

వనమా రాఘవేందర్ వేధింపుల గురించి ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్పీ వీడియోలో వివరించారు.  తన భార్య శ్రీలక్ష్మిని వనమా రాఘవేందర్ చంపాలని ఆర్డర్ వేశాడని చెప్పారు. డబ్బులైతే ఇచ్చేవాడినని కానీ తన భార్యను రాఘవేందర్ దగ్గరకు ఎలా పంపగలను అని ఆయన ప్రశ్నించారు. ఈ సెల్ఫీ వీడియోతో పాటు Suicide letterను కూడా రామకృష్ణ కూడా రాశారు.ఈ లేఖలో కూడా  వనమా రాఘవేందర్ పేరును కూడా  రామకృష్ణ రాశాడు.

వనమా రాఘవేందర్ పై రామకృష్ణ Selfie వీడియో బయటకు వచ్చిన తర్వాత విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం బంద్ నిర్వహించాయి. టీఆర్ఎస్ నుండి వనమా రాఘవేందర్ ను సస్పెండ్ చేశారు.

 టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాతే పోలీసులు రాఘవేందర్ ను అరెస్ట్ చేశారు.రామకృష్ణ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వనమా రాఘవేందర్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో  బయటకు రాని వారు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో పోలీసులను ఆశ్రయించి కూడా న్యాయం జరగని వారు మరోసారి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

వనమా రాఘవేందర్ బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. రాఘవేందర్ తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వనమా రాఘవేందర్ ను నియోజకవర్గంతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు  గత వారంలో నియోజకవర్గ ప్జలకు బహిరంగ లేఖ రాశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం