హైదరాబాద్ లో ఘోర ప్రమాదం... పేలిన గ్యాస్ సిలిండర్, 11మందికి గాయాలు

By Arun Kumar PFirst Published Nov 23, 2021, 8:54 AM IST
Highlights

హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇళ్లు మొత్తం ధ్వంసమవడంతో పాటు 11మంది గాయపడ్డారు. 

హైదరాబాద్‌: ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామున తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని నానక్ రామ్ గూడలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇళ్లు మొత్తం ధ్వంసం అవడమే కాదు భారీగా మంటలు చెలరేగి 11మంది గాయపడ్డారు.  

gas cylinder blast  పై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన వారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసారు. ఈ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలావుంటే నిన్న(సోమవారం) మరో తెలుగు రాష్ట్రమైన andhra pradesh లో ఇలాగే గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఓ కుటుంబం బలయ్యింది. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. 

read more  విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుతున్న గ్యాస్ సిలిండర్లు, 20 పూరిళ్లు దగ్ధం

nellore district mallam village లోని అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో నిన్న తెల్లవారుజామున గ్యాస్ లీకయి పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లంతా ధ్వంసమై అబ్బాస్ తో పాటు అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృతిచెందారు. వీరి కుమార్తె అయేషా Nellore ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

అబ్బాస్, నౌషాద్ దంపతులు నెల్లూరులో టిఫిన్ సెంటర్ నడిపిస్తూ జీవనం సాగిస్తారు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం కూడా టిఫిన్ తయారు చేయడానికి గ్యాస్ స్టౌ ముట్టించగా అప్పటికే Gas leak అవుతుండటంతో పేలుడు సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ముందు భార్య నౌషాద్ కు మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన భర్త అబ్బాస్ కాపాడడానికి వెళ్లడంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలకు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే వీరి పదమూడేళ్ల కూతురు అయేషా అక్కడే ఉండడంతో ఆమెకు కూడా Fires అంటుకున్నాయి. అయితే ప్రమాదాన్ని గమనించిన స్తానికులు అయేషాను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయేషా మరణించింది. 

click me!