
భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలంలోని రామచంద్రుని పేట ఆశ్రమ పాఠశాలలో 10th class చదువుతున్న విద్యార్థిని suicide చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని పురుగుల మందు తాగి ఈ అఘయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ student అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 19న హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లింది.
అనారోగ్యం విషయం parentsకు తెలిసి విద్యార్థినికి వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలో విద్యార్థిని pregnant అని తేలడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఈ నెల 27న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. Karnataka లోని శివమొగ్గలో దారుణ ఘటన జరిగింది.
Minor అయిన భార్య చెల్లెలిని మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేశాడో కీచక బావ. సదరు బావ మీద జిల్లాలోని కుంసి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అక్క-బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను తోబుట్టువుల చూసుకోవాల్సిన brother-in-law ఆమె మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని sexual desires తీర్చుకుంటున్నాడు.
ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ బాలిక ఏడు నెలల pregnant అని వైద్యులు తెలిపారు. దీంతో అక్క షాక్ కు గురైంది. తరువాత బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుంది. బయటికి పొక్కితే సంసారం ఇబ్బందుల్లో పడుతుందనుకుందో ఏమో.. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి.. గొడవలు లేకుండా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం బాలికకు నొప్పులు రాగా మెగ్లాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఏడు నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సదరు కీచక బావను కటకటాల్లో కి తరలించారు.
ఇలాంటి ఘటనే జనవరిలో ఛత్తీస్ గఢ్ లో వెలుగులోకి వచ్చింది. Chhattisgarhలోని రాయ్ పూర్ ప్రాంతానికి చెందిన 13 యేళ్ల బాలిక Instagram ఖాతాలో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ఎప్పటికప్పుడు ఫొటోలు దిగి అప్ లోడ్ చేసేది. అయితే అదే ప్రాంతానికి చెందిన 25యేళ్ల వ్యక్తి ఆమెను ఇన్ స్టాలో Follow అవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆమెను ఆకర్షించడానికి బాలిక షేర్ చేసిన ప్రతీ ఫొటోను లైక్ చేస్తూ.. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ చేసేవాడు. అలా కొద్ది రోజుల తరువాత ఆమెకు అతడికి పరిచయం పెరిగింది.
ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. తరువాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేస్తూ మాట్లాడేవాడు. అలా అతడు బాలికను ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలోనే నిరుడు డిసెంబర్ నెల మొదటివారంలో అతడు బాలికకు ఫోన్ చేసి తనని కలవాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె ప్రియుడిని కలవడానికి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. అలా ఇద్దరూ బయట కాసేపు మాట్లాడుకున్న తరువాత అతడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
అక్కడ బాలిక మీద molestation చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం నుంచి ఆమెను తలనొప్పి వేధిస్తోంది. మాత్రలు వేసుకున్నా ఎంతకీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పాడు. అది విన్న తల్లిదండ్రులు కంగుతిన్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు. ఈ విషయం మీద బాలికను గట్టిగా నిలదీయగా జరిగిందంతా చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.