కేసీఆర్, మోడీలు డ్రామాలాడుతున్నారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

Published : Apr 11, 2023, 01:02 PM IST
కేసీఆర్,  మోడీలు డ్రామాలాడుతున్నారు: సీఎల్పీ  నేత భట్టి విక్రమార్క  ఫైర్

సారాంశం

రాష్ట్ర పర్యటనకు  వచ్చిన  సమయంలో  తెలంగాణలో  అవినీతి  జరిగిందని  మోడీ  ప్రకటించారన్నారు. కానీ  ఈ అవినీతిపై  మోడీ  ఎందుకు  చర్యలు తీసుకోలేదని  సీఎల్పీ  నేత  భట్టి విక్రమార్క  ప్రశ్నించారు.

మంచిర్యాల: ఈ నెల  14న  మంచిర్యాలలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  భారీ బహిరంగగ  సభ  నిర్వహిస్తున్నట్టుగా  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు. మంగళవారంనాడు  ఉమ్మడి  ఆదిలాబాద్  జిల్లాలో  సీఎల్పీ  నేత మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. మంచిర్యాలలో  నిరవహించే  సభలో  ఎఐసీసీ  అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే  పాల్గొంటారని  ఆయన  చెప్పారు. 

తెలంగాణ  రాష్ట్రంలో  అవినీతి  జరిగుగుతుందని  ఆరోపణలు  చేసిన  ప్రధాని  మోడీ ఎందుకు  చర్యలు తీసుకోవడం లేదని  ఆయన  ప్రశ్నించారు. కేసీఆర్  ఆదిలాబాద్  అభివృద్దిని అడ్డుకుంటున్నారని  ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం  పేదలకు  ఇచ్చిన భూములను  కేసీఆర్ సర్కార్  లాక్కొంటుందని  ఆయన  విమర్శించారు.  ప్రధాని  మోడీ, కేసీఆర్ లు  డ్రామాలాడుతున్నారని  ఆయన  విమర్శించారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్