ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలోని జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మోడీ కౌంటరిచ్చారు.
జగిత్యాల: తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలో కన్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.జగిత్యాలలో సోమవారం నాడు జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు.అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం ప్రారంభమైందని మోడీ చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాలలో సోమవారం నాడు జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు.అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవం ప్రారంభమైందని మోడీ చెప్పారు.
undefined
శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని మోడీ ప్రశ్నించారు.శక్తి వినాశనం చేసేవాళ్లకు.. శక్తి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందని మోడీ పేర్కొన్నారు. శక్తి రూపంలో మహిళలు తనను ఆశీర్వదించేందుకు వచ్చారు.. ఇది తన భాగ్యమని మోడీ తెలిపారు.
శక్తి స్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెల పూజారినని మోడీ చెప్పారు.శక్తి స్వరూపులైన మహిళల రక్షణ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉన్నానని మోడీ పేర్కొన్నారు.తాను భారతమాత పూజారిగా మోడీ తెలిపారు.
BJP stands committed to fulfil the aspirations of the people of Telangana. The record affection at the Jagtial rally is a clear indication of which way the wind is blowing.https://t.co/jzogAPFDsB
— Narendra Modi (@narendramodi)ముంబై శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని మోడీ ప్రస్తావించారు. తన పోరాటం శక్తికి వ్యతిరేకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని మోడీ గుర్తు చేశారు. శక్తిని ఖతం చేస్తానని రాహుల్ గాంధీ చేసిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని మోడీ వివరించారు.
చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడ శివశక్తి అని పేరు పెట్టుకున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు.శక్తిని నాశనం చేసేవారికి, శక్తిని పూజించేవారికి మధ్య పోరాటం సాగుతుందన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలుతుందని మోడీ పేర్కొన్నారు.ఈవీఎం, ఐటీ, ఈడీలే అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.