తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజీనామా: తమిళనాడు నుండి ఎన్నికల బరిలోకి?

By narsimha lodeFirst Published Mar 18, 2024, 11:19 AM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.

హైదరాబాద్:  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారని సమాచారం.  తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై కొనసాగుతున్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి  తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో  తమిళిసై సౌందరరాజన్  తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పంపారు. 

తమిళిసై సౌందర రాజన్  20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో  చురుకుగా ఉన్నారు.  బీజేపీలో  ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తూత్తుకుడి పార్లమెంట్ స్థానం నుండి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు.2011లో వెలచ్చేరి, 2016లో  విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

లోక్ సభ ఎన్నికలకు  రెండు రోజుల క్రితమే  ఈసీ  షెడ్యూల్ ను విడుదల చేసింది.  చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి పార్లమెంట్ స్థానాల నుండి తమిళిసై సౌందర రాజన్  పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.

2019 సెప్టెంబర్  నుండి తెలంగాణ గవర్నర్ గా  తమిళిసై సౌందర రాజన్  బాధ్యతలు చేపట్టారు.2021 ఫిబ్రవరి  21న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడ  తమిళిసై సౌందరరాజన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.తమిళిసై సౌందర రాజన్  తండ్రి కాంగ్రెస్ పార్టీ. అయితే తమిళిసై సౌందర రాజన్ మాత్రం బీజేపీలో చేరారు. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేయడం కోసం తమిళిసై సౌందర రాజన్  కృషి చేశారు.


 


 

click me!