కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ విజయవాడ కనకదుర్మమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోతోందని తెలిపారు. పదేళ్లలో తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారని అన్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. ఆయన వెంట సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి, పీసీసీ చీఫ్ గిడుగు రుద్ర రాజు ఉన్నారు. వీరంతా కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు వారికి స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు.
చంద్రయాన్-3 పంపే సమాచారం కోసం అమెరికా, రష్యా ఎదురు చూపు - కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
undefined
దర్శనం అనంతరం డీకే శివ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. పదేళ్లలో తెలంగాణకు సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలకు, దళితులకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని అన్నారు. తాము కర్ణాటకలో ఇచ్చిన హామీలు మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే అమలు చేశామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని డీకే శివ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు టైమ్ వేస్ట్ చేసుకోవద్దని, సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు పరిమితం అవుతాడని అన్నారు. కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని తెలిపారు. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తోందని చెప్పారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు తమ పార్టీని గెలిపించాయని అన్నారు.