తెలంగాణలో సిపిఎం ఒంటరి పోరు.. ఆ వ్యాఖ్యలు బాధించాయి : తమ్మినేని

Published : Nov 11, 2023, 12:10 PM IST
తెలంగాణలో సిపిఎం ఒంటరి పోరు.. ఆ వ్యాఖ్యలు బాధించాయి : తమ్మినేని

సారాంశం

సీపీఎంకు సీట్లు ఇస్తే ఓడిపోతామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారని, ఆయన వ్యాఖ్యలు తనను బాధించాయని తమ్మినేని అన్నారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ తో పొత్తు లేకుండా సీపీఎం ఒంటరిగానే ఎన్నికల్లో బరిలోకి దిగుతోందని తెలిపారు తమ్మినేని వీరభద్రం. టిఆర్ఎస్, కాంగ్రెస్ వర్గ స్వభావం తనకు తెలుసన్నారు. ఆ రెండు పార్టీలు బూర్జువా పార్టీలని మండిపడ్డారు తమ్మినేని వీరభద్రం. చివరివరకు పొత్తు మాటలు చెప్పి, చివర్లో కాంగ్రెస్ కాదనుకోవడం వల్లే ఒంటరి పోరుకి వెడుతున్నామన్నారు. 
 
ఇండియా కూటమిలో ఉన్న మీకు.. దూరంగా ఉన్న మాకు పొత్తు ఏంటని బీఆర్ఎస్ అడిగిందని కాంగ్రెస్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు వీరభద్రం. కాంగ్రెస్ తోడ్పాటు లేకుండా బిజెపిని దేశం నుంచి తప్పించలేమని అందుకే పొత్తుకు మొగ్గుచూపామన్నారు. సీపీఎంకు సీట్లు ఇస్తే ఓడిపోతామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారని, ఆయన వ్యాఖ్యలు తనను బాధించాయని తమ్మినేని అన్నారు. తాము  జ్యోతిబసు హయాంలో ప్రధాని పదవిని వద్దనుకున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు