బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదన్నారు. బీసీ ముఖ్యమంత్రి పదవి పేరుతో ఆ వర్గాలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: డిపాజిట్లు రాని పార్టీ రాష్ట్రానికి బీసీ అభ్యర్ధిని ముఖ్యమంత్రిని ఎలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.ఆదివారంనాడు హైద్రాబాద్ లో జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 105 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీకి 110 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కానున్నాయని ఆయన జోస్యం చెప్పారు.డిపాజిట్లు రాని పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.దేశంలోని 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఒక్కరు మాత్రమే ఓబీసీ సీఎం ఉన్నారన్నారు.
undefined
బీసీ గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా కూడ భారతీయ జనతా పార్టీ మాత్రం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.బీసీ గణన చేయలేని పార్టీ బీసీని సీఎంగా ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ మాటలను దళితులు ఎవరూ కూడ నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్ రెడ్డి చెప్పారు.ఎన్నికలు అయ్యాక ఎస్సీ వర్గీకరణ హామీని బీజేపీ పట్టించుకోదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఎన్నికల కోసమే బీజేపీ ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
also read:Revanth Reddy... కాంగ్రెస్ గెలుపు కోసం నా చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా: రేవంత్ రెడ్డి
రైతులకు ఉచిత విద్యుత్ ను ఇచ్చిన తొలి పార్టీ కాంగ్రెస్సేనని ఆయన చెప్పారు.చేసిన అభివృద్ది చెప్పి ఓట్లు అడిగే స్థితిలో కేసీఆర్ లేరని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు కేవలం 8 నుండి 10 గంటల పాటు మాత్రమే విద్యుత్ ను సరఫరా చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.ధరణి వల్ల భూదోపీడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ధరణి ద్వారా లక్షన్నర ఎకరాలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓట్ల కోసం కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారన్నారు. తెలంగాణ వాసన లేకుండా కేసీఆర్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
అర్హత కలిగిన వారికి అవకాశం కల్పించడమే కాంగ్రెస్ విధానమన్నారు. రుణమాఫీ చేయాలనే చిత్తశుద్ది కేసీఆర్ కు లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి రుణమాఫీ చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.అధికారం కోల్పోతున్నామని కేసీఆర్ విచక్షణరహితంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.తమ పార్టీ మేనిఫెస్టో బీఆర్ఎస్ ను భయపెడుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.యూపీఎస్‌సీ తరహలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎకరాకు సాగు నీళ్లివ్వాలంటే రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.