తెలంగాణ ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారన్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్లు పెట్టిన ట్వీట్లకు తాము సమాధానం చెబుతామని ఆయన అన్నారు.
తెలంగాణలో ఫలితం కాంగ్రెస్ పార్టీ విజయం కాదని, తెలంగాణ ప్రజల విజయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అన్నారు. హైదరాబాద్‌లో శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో దూసుకుపోతోంది. ఒట్ల లెక్కింపు మొదలుపెట్టినప్పటి నుంచి ముందంజలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
తదుపరి కార్యచరణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని ఆయనను మీడియా వాళ్లు ప్రశ్నించగా, తాను ఇప్పడేమీ మాట్లాడదలుచుకోవడం లేదని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారన్నారు. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్లు పెట్టిన ట్వీట్లకు తాము సమాధానం చెబుతామని ఆయన అన్నారు.
undefined
మరోవైపు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పారు. తాను సీఎం రేసులో ఉన్నదీ, లేనిదీ ఇప్పుడు అవసరం లేదని చెప్పారు. ఇక, డీజీపీ వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడంపై కూడా ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాబట్టి, ఆయనను డీజీపీ కలిశారని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కృషి చేశారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రజలు విజయం సాధించారని, సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.