చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ గెలుపొందారు. ఆయన బాల్క సుమన్‌పై విజయం సాధించారు.
చెన్నూర్ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి బాల్క సుమన్‌పై గెలుపొందారు. చెన్నూర్‌లో ప్రధానంగా బీఎఆర్ ఎస్ నుంచి బాల్క సుమన్, కాంగ్రెస్ నుంచి గడ్డం వివేక్, బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ బీఆర్‌ఎస్‌ని వెనక్కి నెట్టి ఆధిక్యంలో ముందుకు సాగుతున్నాడు. ఇక రెండు సార్లు గెలిచిన బాల్క సుమన్ వెనబడ్డారు. ఇక్కడ బీజీపీ మూడో స్థానానికే పరిమితమయ్యింది.
ఇక గడ్డం వివేక్ ఇప్పటికే అనేక సార్లు పార్టీలు మారారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్, అక్కడి నుంచి బీజేపీ, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. దాదాపు ఐదారు సార్లు ఆయన పార్టీలు మారి, రాష్ట్రంలోనే అత్యధిక సార్లు పార్టీలు మారిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయినా తెలంగాణ 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం. బాల్క సుమన్‌పై 31, 189ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.