bansuwada Election Results 2023 : బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం.. ఓటమి సంప్రదాయానికి బ్రేక్..

By Asianet News  |  First Published Dec 3, 2023, 2:26 PM IST

bansuwada Election Results 2023 : బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి  ఏనుగు రవీందర్ పై భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన వారందరూ ఓడిపోతున్న తరుణంలో పోచారం మాత్రం గెలుపొంది ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువుడుతున్నాయి. ఇందులో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అధికార బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమయ్యింది. మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. ఇలాంటి సమయంలో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

Latest Videos

undefined

ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ పై  23,582పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాసన సభ స్పీకర్ గా పని చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ మళ్లీ గెలిచన దాఖలాలు లేవు. అందుకే ఆ పదవి స్వీకరించేందుకు ఎమ్మెల్యేలు వెనుకంజ వేస్తుంటారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి దఫాలో మధుసూదనా చారి స్పీకర్ గా వ్యవహరించారు. కానీ ఆయన కూడా మళ్లీ శాసన సభలో అడుగుపెట్టలేదు. 

Kodangal Election Results 2023 : కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు.. 32,800 ఓట్ల మెజారిటీతో విజయం..

కానీ ఈ ఓటమి సంప్రదాయాన్ని తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. కాగా.. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  1994 నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పదవిని చేపట్టారు. రెండో సారి ఆయనకు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. 

click me!