టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ బిర్లామందిర్‌లోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పాదాల వద్ద కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు. ఆయన వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ తదితరులు వున్నారు.
దాదాపు రెండు నెలల నుంచి అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, వ్యూహ రచనలతో బిజీగా వున్న నేతలు నిన్న సాయంత్రం నుంచి కాస్తంత సేద తీరుతున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా ఆలయాలకు క్యూ కడుతున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ బిర్లామందిర్‌లోని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పాదాల వద్ద కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు చేశారు. ఆయన వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్ తదితరులు వున్నారు.
అయితే వీరందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున ఐదుగురు మాత్రమే ఆలయంలోకి వెళ్లాలని సూచించారు. దీంతో రేవంత్, థాక్రే, మల్లు రవి, అంజన్ కుమార్ మాత్రమే లోపలికి వెళ్లారు. బిర్లా మందిర్‌లో ప్రార్ధనల అనంతరం నాంపల్లి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు వెలువడుతున్న అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే వస్తుండటంతో నేతలంతా మంచి జోష్‌తో వున్నారు. మరి అధికారం అందుతుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
undefined
ALso Read: చేయి చేయి కలుపుదాం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం : తెలంగాణ ప్రజలకు రేవంత్ సందేశం
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. దీంతో మైకులు ఎక్కడికక్కడ మూగబోయాయి. దాదాపు రెండు మూడు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను సీఎంగా చేస్తే ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఇంతటి విధ్వంసం తర్వాత కూడా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని 30 లక్షల మంది నిరుద్యోగులు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు. సోనియమ్మ ఆధ్వర్యంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.. ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.. చేయి చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం..' అని టీపీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు.