తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి... కానీ ఓటు మాత్రం సమర్దులకే వేయాలని తెలంగాణ ప్రజలకు వర్మ సూచించారు.
హైదరాబాద్ : మన భవిష్యత్ ను నిర్ణయించే ఓటును అమ్ముకోవద్దని... మనకు మంచిచేసే వారిని గెలిపించుకోవాలని ప్రజాహితం, సుపరిపాలన కోరుకునేవారు ప్రజలను కోరుతుంటారు. కానీ ఇదే విషయాన్ని వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన స్లైల్లో మరోలా చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకొండి... కానీ ఓటుమాత్రం మంచి చేస్తాడని నమ్మేవారికే వేయాలని ప్రజలకు రాంగోపాల్ వర్మ సూచించారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగి, ప్రజా సమస్యలు తెలిసినవారికి ఓటేసి గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ అర్టిస్ట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన 'ఆర్ట్ ఫర్ డెమోక్రసీ' వాల్ పోస్టర్ ను వర్మ ఆవిష్కరించారు.
undefined
ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ... నియోజకవర్గం అభివృద్ది, ప్రజలకు మౌళిక వసతులు కల్పించే నాయకులకు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుందన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోను తాను చూడలేదని... కాబట్టి వాటిగురించి మాట్లాబోనని అన్నారు. ఈ మేనిఫెస్టోను రూపొందించడం, అమలుచేయడం ఎలాగో తెలిస్తే దానిపై స్పందించడం ఎందుకు... తానే రాజకీయ నాయకుడిగా మారేపోయేవాడినని రాంగోపాల్ వర్మ అన్నారు.
Read More Telangana Assembly Elections 2023 : తెలంగాణలో 144 సెక్షన్... పోలీస్ శాఖ హైఅలర్డ్
ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీపైనా రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ బిజెపితో పొత్తులో భాగంగా జనసేన కొన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తోంది... కానీ ఈ ఎన్నికలపై పవన్ కల్యాణ్ అంత ఆసక్తి లేరన్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్ ప్రచారాన్ని చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఆయన కంటే కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న కర్న శిరీష అలియాస్ బర్రెలక్క సీరియస్ గా ప్రచారం చేస్తోందని అన్నారు. పవన్ కంటే బర్రెలక్క చాలా బెటర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.