పోలీసుల వార్నింగ్.. ఎన్నికల నిబంధనలను ధిక్కరించిన రేవంత్ రెడ్డి సోదరుడు 

By Rajesh Karampoori  |  First Published Nov 29, 2023, 3:28 AM IST

ఎన్నికల నియమం ప్రకారం సాయంత్రం 5 గంటలు దాటితే ప్రచారం ముగియడంతో పాటు స్థానికేతరులు ఉండకూడదని, రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనకూడదనే షరతులున్నాయి.  



కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా  కామారెడ్డి నియోజకవర్గంలో కనిపించడంతో ఆయన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని స్థానిక రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్తానిక, స్థానికేతర నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

నియమం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో స్థానికేతరులు, రాజకీయ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే ఇతరులు నియోజకవర్గాల్లో ఉండకూడదు. అయితే లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లలో బస చేసే బయటి వ్యక్తుల కోసం జిల్లా పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. టీపీసీసీ అధ్యక్షుడి సోదరుడు కొండల్‌రెడ్డి కంట పడ్డారు.

Latest Videos

undefined

దేవనపల్లి పోలీస్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ నివాసంలో ఉంటున్నాడు. కొండల్‌రెడ్డిని ప్రశ్నించగా.. తాను స్వతంత్ర అభ్యర్థి దొడ్ల రాజేందర్‌ ఎన్నికల ఏజెంట్‌గా పనిచేస్తున్నానని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. తాము అతని ఆధారాలను ధృవీకరిస్తున్నామనీ, తదనుగుణంగా చర్యలు ప్రారంభిస్తామని సింధు శర్మ తెలిపారు. తన సోదరుడు రేవంత్ రెడ్డి అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సమయంలో కొండల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ అని చెప్పుకోవడంపై దుమారం రేగడంతో పాటు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలో దేవునిపల్లిలో రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది ఎందుకని కొండల్ రెడ్డి ప్రశ్నించారు. ప్రైవేట్ వాహనాల్లో రావడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కొండల్ రెడ్డి చెబుతున్నారు. 

click me!