తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ పై రాఘవేందర్ రాజు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నిర్వహించింది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారంనాడు తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది.మంత్రి శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ పై రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.తన ఎన్నికల అఫిడవిట్ లో సరైన వివరాలు పేర్కొనలేదని రాఘవేందర్ రాజు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా కూడ పట్టించుకోలేదని రాఘవేందర్ రాజు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.రాఘవేందర్ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్ పై రాఘవేందర్ రాజు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు 2023 అక్టోబర్ 10వ తేదీన కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందున ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది.
undefined
ఈ దఫా కూడ ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ సరైన సమాచారం ఇవ్వలేదని మరోసారి హైకోర్టును రాఘవేందర్ రాజు ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా వి.శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. మరోసారి ఇదే అసెంబ్లీ స్థానం నుండి వి.శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్ కేబినెట్ లోకి వి.శ్రీనివాస్ గౌడ్ కు చోటు దక్కింది.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా ఏపీ మిథున్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
యెన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.
మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి తొలిసారిగా మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు.