తమిళిసై చేతికి కొత్త ఎమ్మెల్యేల జాబితా.. మూడో శాసనసభ ఏర్పాటు , గెజిట్ నోటిఫికేషన్ జారీ

By Siva KodatiFirst Published Dec 4, 2023, 5:25 PM IST
Highlights

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాసేపటి క్రితం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు.

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కాసేపటి క్రితం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు.

కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో  సోమవారంనాడు  కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతను ఎంపిక చేసే బాధ్యతను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాత్రికి కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  తెలంగాణలో సీఎల్పీ నేతపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడ  అభిప్రాయాలను కూడ సేకరించారు  కాంగ్రెస్ నేతలు.  

సీఎల్పీ సమావేశానికి  పరిశీలకులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ , మురళీధరన్ తదితరులు  విడివిడిగా ఎమ్మెల్యేలతో మాట్లాడారు.  సీఎల్పీ నేతగా ఎవరుంటే పార్టీకి ప్రయోజనమనే విషయమై  ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు.  ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడ  కాంగ్రెస్ నేతలు  కాంగ్రెస్ నాయకత్వానికి పంపారు.

ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో  సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రతిపాదించారు.ఈ తీర్మానాన్ని  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి,  సీతక్క,తుమ్మల నాగేశ్వరరావు, ప్రేం సాగర్ రావు తదితరులు బలపర్చారు. 

click me!