తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని
పెంచుకుంది. కాంగ్రెస్ కూడ తన ఓట్ల శాతం పెంచుకుంది. టీడీపీ ఓట్ల శాతం గణనీయంగా పడిపోయింది.
హైదరాబాద్: 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకొంటామని ఆ పార్టీ ధీమాగా ఉంది.ఈ దఫా ఆ పార్టీ ఎన్ని సీట్లు, ఎంత శాతం ఓట్లను సాధించనుందో ఈ నెల 3వ తేదీన తేలనుంది.
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. 2014 మే మాసంలో ఎన్నికలు, కౌంటింగ్ పూర్తైంది. ఎన్నికలు పూర్తైన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది.2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
undefined
2014లో బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగా బరిలోకి దిగింది.
2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం పెరిగింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో సీట్లు కూడ పెరిగాయి. 2014లో బీఆర్ఎస్ కు 34.3 శాతం ఓట్లతో 63 సీట్లు దక్కించుకుంది. 2018లో 47.4 శాతం ఓట్లతో 88 సీట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది.
పార్టీ | 2014 లో ఓట్ల శాతం | 2018 లో ఓట్ల శాతం |
1.బీఆర్ఎస్ | 34.3 | 47.4 |
2.కాంగ్రెస్ | 26.1 | 28.7 |
3.బీజేపీ | 07.1 | 6.98 |
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 26.1 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28.7 శాతం ఓట్లు వచ్చాయి.
మరో వైపు 2014 ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయింది.2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలు కలిసి పోటీ చేశాయి.ఈ కూటమికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఈ కూటమి తరపున పవన్ కళ్యాణ్ కూడ ప్రచారం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 15 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఏడు స్థానం ఓట్లతో ఐదు స్థానాల్లో విజయం సాధించింది.
also read:Longest serving Chief Ministers:అత్యధిక కాలం సీఎంలుగా.. పవన్ కుమార్, నవీన్ పట్నాయక్..జ్యోతిబసు
2018 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అయితే ఆ పార్టీకి 3.5 శాతం ఓట్లను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి సుమారు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కూడ ఆ పార్టీ సుమారు ఏడు శాతం ఓట్లను దక్కించుకుంది. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైంది.