T Raja Singh : బీజేపీతో టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం - రాజాసింగ్

By Asianet News  |  First Published Dec 2, 2023, 10:58 AM IST

telangana assembly election results : బీజేపీ 25 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇప్పటికే తమ పార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు. అవసరమైతే తమ పార్టీయే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


T Raja Singh : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటికే పలు ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. అందులో మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపట్టబోతున్నాయని అంచనా వేశాయి. దీనిని బీఆర్ఎస్ కొట్టిపారేస్తుండగా.. కాంగ్రెస్ ధీమాగా ఉంది. దీనిపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

DK Shivakumar : ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు.. కర్ణాటకలో ఏం జరిగిందో అందరికీ తెలుసు - డీకే శివ కుమార్

Latest Videos

undefined

వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతీ ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అయితే వాస్తవ ఫలితాలకు, వాటికి చాలా తేడా ఉంటుంది. గురువారం తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం ఉండాల్సిన దానికంటే తక్కువగా నమోదైంది. కాంగ్రెస్ కు ఆధిక్యం, బీఆర్ఎస్ సీట్ల సంఖ్య తగ్గుతుందని, అలాగే బీజేపీకి సీట్ల సంఖ్య పెరగడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ’’ అని రాజా సింగ్ అన్నారు. 

ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాదని తాను గతంలోనే చెప్పానని అన్నారు. కాబట్టి ఈ సారి తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయని రాజా సింగ్ ఆరోపించారు. అందుకే అవసరమైన చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ నిలబట్టిందని, కాబట్టి బీఆర్ఎస్ తో కలిసి ఆ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. 

క్యాంపు రాజకీయాలకు తెర తీసినా కాంగ్రెస్.. బీజేపీ సంచలన ఆరోపణలు..

అయితే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజా సింగ్ అన్నారు. అవసరమైతే వారు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. ‘‘నాకు పూర్తి నమ్మకం ఉంది. గోషామహల్ నుంచి నేను గెలుస్తాను. మా పార్టీ 25 సీట్లు గెలుచుకుంటుంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మాకు 25 సీట్లు గెలుచుకుంటే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారు. అప్పుడు మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు ’’ అని అన్నారు. 

Cyclone Michaung: తుఫాను సైర‌న్.. భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌కు రెడ్ అల‌ర్ట్

డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంపై రాజా సింగ్ స్పందించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని అన్నారు. బహుశా ఆయన ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. కలల నుంచి బయటకు రావాలని, తెలంగాణలో బీజేపీ లేదా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. 

click me!