Telangana Election Results:అసదుద్దీన్ తన కంచుకోటను నిలుపుకోగలడా..?

By telugu news teamFirst Published Dec 3, 2023, 10:38 AM IST
Highlights

మధ్యాహ్నం సమయానికి ఏ పార్టీ ఆధిక్యంలోకి వస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏ మేర సత్తా చాటుతారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
 


తెలంగాణ ఎన్నికలక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ పోలింగ్ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరుగుతోంది. మధ్యాహ్నం సమయానికి ఏ పార్టీ ఆధిక్యంలోకి వస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏ మేర సత్తా చాటుతారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన పార్టీ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో ఒవైసీకి కంచుకోట అయిన ఓల్డ్ హైదరాబాద్ ప్రాంతంలో ఏడు సీట్లు ఉన్నాయి. చార్మినార్, బహదూర్‌పురా, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకుత్‌పురా, కారవాన్ స్థానాల్లో ఏఐఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో పాటు రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ స్థానాల నుంచి కూడా ఏఐఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Latest Videos

రాష్ట్రంలోని చాంద్రాయణగుట్ట స్థానం నుంచి అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. 2018లో గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 59.19 శాతం అంటే 95339 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఒవైసీ పార్టీ 6-8 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. మరి ఈ ఫలితాలు ఎంఐఎంకి అనుకూలంగా ఉన్నాయో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే. ఎప్పటిలాగానే ఎంఐఎం తన కంచుకోటను కాపాడుకుంటుందో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా,  తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, 60 సీట్ల మెజారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 60సీట్లు అవసరం అవుతాయి. మరి, తెలంగాణ పీఠాన్ని ఏ పార్టీ  దక్కించుకుంటుందో చూడాలి. ఎంఐఎం.. బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చే అవకాశం కనపడుతోంది.
 

click me!