ఓటు వేసే ముందు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆలోచించాలని , ఆగం కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పనుల్ని చూసి తమను మరోసారి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఓటు వేసే ముందు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆలోచించాలని , ఆగం కావొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదన్నరేళ్లలో ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రయాణం కొనసాగించామన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పనుల్ని చూసి తమను మరోసారి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
అప్పుడెలా వుండేది తెలంగాణ.. ఇప్పుడు ఎట్లయిందో గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలని మంత్రి కోరారు. మీ గ్రామం, మీ పట్టణం, మీ పల్లె ఎలా మారిందో మీ కళ్లముందే వుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ముఖ చిత్రం ఎంతగా మారిపోయిందో చూడాలని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు వలసలు ఆగిపోయాయని, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి మన పొలాల్లో పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
undefined
ALso Read: Telangana Elections 2023 : 119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే...
నల్గొండలో ఫ్లోరైడ్ బండ దిగిపోయిందని, స్వచ్ఛమైన భగీరథ జలాలతో గొంతులు తడుస్తున్నాయని మంత్రి చెప్పారు. అన్నమో రామచంద్ర అని అలమటించిన తెలంగాణ ఇవాళ దేశానికే అన్నం గిన్నెలా మారిన మాట వాస్తవం కాదా కేటీఆర్ ప్రశ్నించారు. మన కొలువులు మనకే దక్కాలన్న నియామకాల నినాదం నిజం కాలేదా అని ఆయన నిలదీశారు.