telangana assembly election 2023 : ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ ఎందుకు పెట్టేవారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, హత్యలు ఉండేవని ఆయన ఆరోపించారు. అలాంటి రాజ్యం ఎవరికి కావాలని అన్నారు.
telangana assembly election 2023 : కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నారని, అయితే ఆమె పాలన ఎన్ కౌంటర్లు, కాల్పులు, హత్యలతో నిండిపోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదనపు పౌర మౌలిక సదుపాయాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
దారుణం.. యూపీలో 13 ఏళ్ల బాలిక కిడ్నాప్.. హైదరాబాద్ లో అత్యాచారం.. నిందితుడి అరెస్టు
undefined
తెలంగాణలో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ ను ప్రస్తుతం ఉన్న రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘మేము గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆ రాజ్యమే అంత బాగుంటే ఎన్టీఆర్ కొత్తగా పార్టీ ఎందుకు పెట్టి, రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, హత్యలతో నిండిపోయింది’’ అని ఆయన ఆరోపించారు.
ఓటింగ్ రోజు అన్ని సంస్థలకు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే.. - వికాస్ రాజ్
కాంగ్రెస్ హయంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో 400 మందిని కాల్చి చంపారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తలసరి ఆదాయం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ను సైతం నేడు తెలంగాణ అధిగమించిందని అన్నారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
అంతకు ముందు గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. రైతాంగం బాగు పడాలని వ్యవసాయ స్థిరీకరణకు పథకాలు చేపట్టామన్నారు. నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని.. నిమ్స్‌ను రెండు వేల పడకలతో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశానని సీఎం గుర్తుచేశారు.
Nara Lokesh : జగన్ హయాంలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది - నారా లోకేష్
ప్రభుత్వం తన అధికారాన్ని రైతులకిచ్చిందని.. ధరణి పోర్టల్‌తో రైతుల భూములకు రక్షణ వచ్చిందని కేసీఆర్ తెలిపారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసి, ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నామని.. తెలంగాణ శాంతి భద్రతలకు ఆలవాలంగా వుందన్నారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశమంతా అనుసరిస్తుందని, రైతుబంధు దుబారా చేస్తున్నారని ఉత్తమ్ అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.