2024 ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం: నిజామాబాద్ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Nov 15, 2023, 4:03 PM IST

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ  కీలక వ్యాఖ్యలు చేశారు.  నిజామాబాద్ వేదికగా  కేసీఆర్  చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చకు దారి తీసే అవకాశం ఉంది. 


నిజామాబాద్:2024 ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం  ఏర్పాటు కానుందని తెలంగాణ సీఎం కేసీఆర్  తేల్చి చెప్పారు.బుధవారంనాడు  నిజామాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్  పాల్గొన్నారు.  జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకొనే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో  2024 లో సంకీర్ణ యుగం వస్తుంది.రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హావా వస్తుందన్నారు.  జాతీయ పార్టీల అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎంపీలను కైవసం చేసుకుంటే  బీఆర్ఎస్ తడాఖా ఢిల్లీలో చూపిస్తామని కేసీఆర్  చెప్పారు.రానున్న రోజులన్నీ ప్రాంతీయ పార్టీలవేనని ఆయన  తేల్చి చెప్పారు. ఈ మేరకు మనమంతా సిద్దంగా ఉండాలని కేసీఆర్  ప్రజలను కోరారు. 

Latest Videos

undefined

నిజామాబాద్ అర్బన్ లో గెలిచిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉందన్నారు.ఎంతమంది పోటీదారులున్నా బీఆర్ఎస్ నే గెలిపించాలని ఆయన  ప్రజలను కోరారు. సమైక్య రాష్ట్రంలో నిజామాబాద్ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందని ఆయన ప్రజలను ప్రశ్నించారు.24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నందునే  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని కేసీఆర్ చెప్పారు. కొత్తగా బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అందిస్తామని కేసీఆర్  స్పష్టం చేశారు.

రానున్న ఐదేళ్లలో తమ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెడితే  పెన్షన్ ను రూ. 5016కు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.ఐదేళ్లలో రైతుబంధును రూ. 16 వేలకు పెంచుతామన్నారు.ఒక్క మెడికల్ కాలేజీ,  నవోదయ స్కూల్ ఇవ్వలేదు,  రూ. 25 వేల కోట్ల నిధులను ఇవ్వలేదన్నారు.ఈ విషయమై  ఓటడిగేందుకు వచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించాలని ఆయన కోరారు.  

also read:తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్: బోధన్ సభలో కేసీఆర్

తెలంగాణను కాంగ్రెస్ ముంచిది కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు.  రాష్ట్రానికి రావాల్సిన నిధుల  విషయంలో బీజేపీ  ఇబ్బందులు పెడుతుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  మూడు గంటల విద్యుతే వస్తుందని ఆయన చెప్పారు. 24 గంటల విద్యుత్ కావాలా, మూడు గంటల విద్యుత్ కావాలో తేల్చుకోవాలని కేసీఆర్  ప్రజలను కోరారు.

 

click me!