నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో బీజేపీ నల్లొండ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై కూడా దాడి జరిగింది. దీనిపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఖండించారు. మంగళవారం నాగార్జునసాగర్ లో బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన తరువాతనే సభకు హాజరవ్వాలని శ్రీధర్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు.
Doda Accident : జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మందికి పైగా మృతి
undefined
సీఎం సభను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే సమయంలో అక్కడే ఉన్న శ్రీధర్ రెడ్డిపై దాడి జరిగింది. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు.
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. pic.twitter.com/LNOU9Nrava
— Asianetnews Telugu (@AsianetNewsTL)ఈ దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గూండాయిజం కొనసాగుతోందని ఆరోపించారు. తమ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని తెలిపారు. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శ్రీధర్ రెడ్డి శాంతియుతంగా నిరసన తెలిపారని అన్నారు. కానీ ఆయనపై పట్టపగలు బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డిపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఫిర్యాదును పార్టీ ఈసీకి కూడా తీసుకెళ్తుందని తెలిపారు.