Revanth Reddy..వ్యూహత్మకంగానే తెరపైకి నాగార్జున సాగర్ వివాదం : రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Nov 30, 2023, 10:34 AM IST
Highlights

ఇన్నాళ్లు లేని నాగార్జునసాగర్ నీటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వివాదంపై  ఆయన ఇవాళ స్పందించారు.

హైదరాబాద్: నాగార్జునసాగర్ వివాదంపై  సీఈఓ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. 

గురువారంనాడు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  కొడంగల్ లో మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ డ్యామ్ పై వ్యూహాత్మకంగానే ఈ వివాదం సృష్టించారని ఆయన ఆరోపించారు.ఎవరు, ఎందుకు ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసునన్నారు.  నాగార్జునసాగర్ డ్యామ్ ఇక్కడే ఉంటుంద్నారు. నీళ్లు కూడ ఎక్కడికి పోవని రేవంత్ రెడ్డి  చెప్పారు. 

Latest Videos

also read:Nagarjuna Sagar పై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయవద్దు: వికాస్ రాజ్

ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా సామరస్యపూర్వకంగానే  పరిష్కరించుకోవాలని ఆయన  సూచించారు. ఇలాంటి కుట్రలు  ఎన్నికలపై  ఎలాంటి ప్రభావం చూపించవని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలింగ్ కు ముందు కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన  ఆరోపించారు.తెలంగాణ ప్రజలు సమస్యను అర్థం చేసుకుంటారని ఆయన  అభిప్రాయపడ్డారు.

also read:Telangana Exit poll Results 2023:తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడంటే?

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  రేవంత్ రెడ్డి చెప్పారు.పాకిస్తాన్, భారత్ కూడ నీటిని పంచుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రెండు దేశాలే నీటిని పంచుకుంటున్నప్పుడు.... రెండు రాష్ట్రాలు నీటిని పంచుకోవడానికి ఇబ్బంది ఏముందని ఆయన  ప్రశ్నించారు.ఇన్నాళ్లు లేని సాగర్ సమస్య ఇప్పుడే గుర్తొచ్చిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

also read:kodangal కోటపై నిలిచిదేవరు?:రేవంత్ , పట్నం..రమేష్‌లలో కొడంగల్ ఓటర్లు పట్టం ఎవరికీ

నాగార్జునసాగర్ డ్యామ్ పై  అక్రమంగా చొరబడి   ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముళ్ల కంచెను బుధవారంనాడు రాత్రిఏర్పాటు చేశారు. డ్యామ్  13వ గేటు వద్దకు చేరుకుని ముళ్ల కంచెను  ఏర్పాటు చేసి డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  దీంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ విషయం తెలిసిన  మిర్యాలగూడ డీఎస్పీ  నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో మాట్లాడారు.

 

click me!