BJP: 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు.. ఐదు సెగ్మెంట్ల వివరాలు

బీజేపీ ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు సెగ్మెంట్‌లలో యాత్రలు చేపట్టనుంది. ఈ విజయ సంకల్పాలకు సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు కిషన్ రెడ్డి విడుదల చేశారు.
 

telangana bjp chief kishan reddy launched poster for his political campaign kms

తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానమంత్రిని చేయడంలో భాగంగా ఈ యాత్రలు ఉంటాయని వివరించారు. ఈ యాత్రకు సంబంధించి శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ లీడర్లు కే లక్ష్మణ్, జితేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, శిల్పా రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. 

ఈ యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన మొదలువుతుంది. మార్చి 1వ తేదీన ముగుస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని వివరించారు. ‘ఇప్పటికే దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణమే ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వర్గాల్లో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే ఈ వాతావరణం ఏర్పడింది’ అని తెలిపారు.

Latest Videos

Also Read: మీ పేరెంట్స్ నాకు ఓటేయకపోతే 2 రోజులు తినకండి.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే వింత సలహా.. వైరల్..

ఈ యాత్ర ఐదు సెగ్మెంట్లుగా సాగుతుంది. ఈ ఐదు సెగ్మెంట్లు అన్ని 17 లోక్ సభ స్థానాలను కవర్ చేస్తాయి.

1. కొమరం భీం యాత్ర: ఈ యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

2. శాతవాహన యాత్ర: ఈ యాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెల్ల నియోజకవర్గాల్లో సాగుతుంది.

3. కాకతీయ యాత్ర: ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల మీదుగా ఈ  యాత్ర జరుగుతుంది.

4. భాగ్యనగర యాత్ర: భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్ గిరి నియోజకవర్గాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది.

5. క్రిష్ణమ్మ యాత్ర: క్రిష్ణమ్మ యాత్ర మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ చేపడుతుంది.

ఈ యాత్రలు అన్నీ వివిధ నియోజకవర్గాలలో మొదలైనా.. హైదరాబాద్‌కు చేరడంతో ముగుస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.  బీజేపీ అన్ని 17 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంపీ(ప్రస్తుతం ఈ స్థానానికి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు) స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని వివరించారు.

click me!