Kamareddy : కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా... కాంగ్రెస్ నాయకురాలి ఇంటికి పోలీసులు

By Arun Kumar PFirst Published Nov 28, 2023, 9:32 AM IST
Highlights

గత అర్ధరాత్రి కామారెడ్డికి చెందిన  ఓ కాంగ్రెస్ నేత ఇంటివవద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంట్లో భారీగా నగదు దాచారన్న అనుమానంతో పోలీసులు సోదా చేసారు. 

కామారెడ్డి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండే పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు డబ్బులు, మద్యం పంచే అవకాశాలు వుండటంతో ఎలక్షన్ కమీషన్, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరిపై అయినా ఫిర్యాదులు అందినా... అనుమానం వచ్చినా వెంటనే  వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఇలా కీలక నాయకుల ఫోటీతో హాట్ టాపిక్ గా మారిన  కామారెడ్డిలో కూడా పోలీస్ సోదాలు మొదలయ్యాయి. 

కామారెడ్డి నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. దీంతో ఇక్కడి రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. గత అర్ధరాత్రి కామారెడ్డికి చెందిన  ఓ కాంగ్రెస్ నేత ఇంటివవద్ద హైడ్రామా చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంట్లో  భారీగా నగదు దాచారనే ఫిర్యాదు అందడంలో సోదాలు చేపట్టారు పోలీసులు. అర్థరాత్రి ఆమె ఇంటికి పోలీసులు చేరుకోగా  అక్కడే వున్న కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎలాగోలా ఇందుప్రియ ఇంట్లోకి చేరుకున్న పోలీసులు సోదాలు చేపట్టినా ఏమీ దొరకలేదు. దీంతో తమకు వచ్చింది తప్పుడు సమాచారమని గ్రహించిన పోలీసులు అక్కడినుండి వెళ్లిపోయారు. 

Latest Videos

Read More  Telangana Assembly Election 2023 : నేడే ప్రచారం ముగింపు... అసలైన సమరానికి కౌంట్ డౌన్ షురూ

 మహిళా  మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో కనీసం ఒక్కరుకూడా మహిళా పోలీసులు లేకుండా సోదాలు చేయడంపై  కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దాడులు చేయడంద్వారా కాంగ్రెస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేయాలని బిఆర్ఎస్ చూస్తోందని అంటున్నారు.  కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి వస్తున్న మద్దతు చూసి ఎక్కడ కేసీఆర్ ఓడిపోతారోనని భయం బిఆర్ఎస్ నాయకులకు పట్టుకుందని... అందువల్లే ఇలా తనిఖీల పేరిట అలజడి సృష్టిస్తున్నారని డిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.  ఎవరో ఫిర్యాదుచేయడం కాదు బిఆర్ఎస్ నేతల ఆదేశాలతోనే పోలీసులు గడ్డం ఇందుప్రియ ఇంటిపై దాడి చేసారని శ్రీనివాస రావు ఆరోపించారు.

ఈసారి  గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీచేస్తున్నారు. దీంతో ఆయనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. కొడంగల్ తో పాటు కామారెడ్డిలో రేవంత్ బరిలోకి దిగారు. దీంతో కామారెడ్డిలో పోటీ రసవత్తరంగా మారింది. తమ అధినేత గెలుపుకోసం బిఆర్ఎస్ నాయకులు... టిపిసిసి చీఫ్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ప్రచారంచేస్తున్నారు. 

ఇక కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వెల్ లో పరిస్థితి మరోలా వుంది. ఇక్కడ కేసీఆర్ పై గతంలో ఆయన సహచరుడైన ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా హుజురాబాద్ తో పాట గజ్వెల్ లోనూ పోటీచేస్తున్నారు ఈటల. దీంతో గజ్వెల్ రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. 
 

click me!