Telangana Assembly Elections 2023 : అత్యధిక, అత్యల్ప పోలింగ్ జరిగిన నియోజకవర్గాలివే...

By Arun Kumar PFirst Published Dec 1, 2023, 8:40 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా అన్నిజిల్లాల్లో మంచి పోలింగ్ శాతమే నమోదయ్యింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నమోదయ్యింది.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. తెలంగాణ ప్రజానీకం తమ నిర్ణయాన్ని ఈవిఎంలలో నిక్షిప్తం చేసారు. అయితే ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ హైదరాబాద్ ప్రజలు ఓటేసేందుకు అనాసక్తి చూపించారు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఓటుహక్కును వినియోగిించుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో అత్యల్పం, జిల్లాల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యింది. 

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు తెలంగాణ వ్యాప్తంగా 70.66 పోలింగ్ శాతం నమోదయినట్లు ఎన్నికల కమీషన్  అంచనా వేస్తోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 46 శాతం పోలింగ్ జరిగింది. నియోజకవర్గాల వారిగా చూసుకుంటే మునుగోడులో 91.51 శాతం,యాకుత్ పురాలో 39.69 పోలింగ్ నమోదయింది. హైదరాబాద్  లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే అతి తక్కువ పోలింగ్ నమోదయ్యింది. 

రాబోయే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలను హైదరబాదీలు సీనియస్ గా తీసుకోలేదు. పోలింగ్ రోజు విద్యాసంస్థలకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సెలవు ఇచ్చారు. ఇలా అందరితో ఓటేయించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమీషన్ ప్రయత్నించింది. కానీ ఓటేసేందుకు పట్టణ ఓటర్లు  బద్దకించడంతో 70 శాతానికే పోలింగ్ పరిమితం అయ్యింది. 

Read More  Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ పై మిశ్రమ స్పందన.. ఇంతకీ పోల్స్ ఫలితాలను విశ్వసించవచ్చా..?

ఇక నిన్నటి పోలింగ్ సరళి, వివిధ ఎగ్జిట్ పోల్స్ ను బట్టిచూస్తే బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు సరిపడా సీట్లు వస్తాయని ఎక్కువ సర్వే ఫలితాలు చెబుతున్నారు. ఈ నెల 3న వెలువడనున్న పలితాల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఆశలు గల్లంతవుతాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు తెలంగాణలో హంగ్ వస్తుందని... బిజెపి కింగ్ మేకర్ అవుతుందని అంటున్నాయి.   


  

click me!