బీసీలకు ప్రత్యేక మంత్రి పదవి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్

By narsimha lode  |  First Published Nov 10, 2023, 3:50 PM IST

తెలంగాణ రాష్ట్ర జనాభాలో  50 శాతానికి పైగా ఉన్న  బీసీలను ఆకర్షించేందుకు బీసీ డిక్లరేషన్ ను  ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.  తమ పార్టీ అధికారంలోకి వస్తే  బీసీలకు ఏం చేస్తామో  ఆ డిక్లరేషన్ లో ప్రకటించింది.


హైదరాబాద్:జనాభా ప్రాతిపదికన  బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే  బీసీ రిజర్వేషన్లను పెంచుతామని  ఆ పార్టీ  హామీ ఇచ్చింది.అంతేకాదు  ప్రత్యేకంగా  బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను కూడ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

నిజామాబాద్ లో  శుక్రవారంనాడు నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.  బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చిన అంశాలను  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్  విడుదల చేశారు. స్థానిక సంస్థల్లో  బీసీ రిజర్వేషన్లను  23 నుండి  42 శాతానికి పెంచుతామని  కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 

Latest Videos

undefined

ప్రతి మండలానికి  బీసీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు.బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టనున్నట్టుగా కాంగ్రెస్  హామీ ఇచ్చింది.  ప్రతి జిల్లాలో  బీసీ భవన్ ను కూడ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా  కాంగ్రెస్ వివరించింది. బీసీ డీ గ్రూప్ లో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ ఏలో చేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ కార్పోరేషన్ ద్వారా ఒక్కొక్కరికి  రూ. 10 లక్షల రుణ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

also read:కేసీఆర్ పూర్వీకుల కొనాపూర్ గ్రామస్తుల విరాళం: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

చేనేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని  హస్తం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో  మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ తెలిపింది.

click me!