చివరి నిమిషంలో బీజేపీ ట్విస్టులు: వేములవాడ వికాస్‌రావు‌దే, సంగారెడ్డిలో దేశ్ పాండేకు షాక్

By narsimha lodeFirst Published Nov 10, 2023, 2:37 PM IST
Highlights

చివరి నిమిషంలో పలువురు అభ్యర్థులను బీజేపీ మార్చింది. తొలుత ఒక అభ్యర్థిని ప్రకటించి బీ ఫామ్ లను మరో అభ్యర్ధికి కేటాయించింది. నామినేషన్లు దాఖలు చేసిన వారికి కాకుండా వేరే అభ్యర్థులకు బీజేపీ బీ ఫామ్ లు కేటాయించిన పరిస్థితి నెలకొంది.


హైదరాబాద్:వేములవాడ అసెంబ్లీ స్థానంలో  చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని మార్చింది.  గతంలో ప్రకటించిన తుల ఉమ స్థానంలో  మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు  చెన్నమనేని  వికాస్ రావు కే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి చెన్నమనేని వికాస్ రావు టిక్కెట్టును ఆశించారు. కానీ  వికాస్ రావుకు కాకుండా  తుల ఉమకు  బీజేపీ టిక్కెట్టును కేటాయించింది. అయితే  ఇవాళ  తుల ఉమకు కాకుండా  చెన్నమనేని వికాస్ రావుకు  బీజేపీ నాయకత్వం బీఫాం అందించింది.  దీంతో  తుల ఉమ అసంతృప్తితో ఉన్నారు. 

also read:చెన్నమనేనికి మొండిచేయి: పైచేయి సాధించిన ఈటల

మరోవైపు  సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో  రాజేశ్వరరావు దేశ్ పాండే పేరును బీజేపీ నాయకత్వం ప్రకటించింది. అయితే  రాజేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో ఆయనకు కాకుండా పులిమామిడి రాజుకు  బీజేపీ నాయకత్వం బీ ఫాం అందించింది.ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరరావు దేశ్ పాండే  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు.  చివరి నిమిషంలో తనకు  బీ ఫాం ఇవ్వకుండా అన్యాయం చేయవద్దని వేడుకున్నారు. ఫోన్ లోనే  కిషన్ రెడ్డి మాట్లాడుతూ  కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు అన్యాయం చేయవద్దని  పార్టీ నాయకత్వాన్ని వేడుకున్నారు.

also read:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023: చివరి జాబితా విడుదల చేసిన బీజేపీ, చోటు దక్కింది వీరికే

బెల్లంపల్లిలో  తొలుత శ్రీదేవి పేరును ప్రకటించింది బీజేపీ నాయకత్వం. అయితే ఇవాళ ప్రకటించిన జాబితాలో శ్రీదేవికి బదులుగా ఏమాజీ పేరును ఆ పార్టీ చేర్చింది.ఇవాళ ఉదయం బీజేపీ 14 మందితో చివరి జాబితాను విడుదల చేసింది. గతంలో  ప్రకటించిన అభ్యర్థుల స్థానంలో కొత్తవారి పేర్లను  ఈ జాబితాలో చేర్చింది.   

ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన  చెన్నమనేని  వికాస్ రావు బీజేపీలో చేరారు. వికాస్ రావుతో పాటు ఆయన సతీమణి కూడ బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. వేములవాడ అసెంబ్లీలో వికాస్ రావు  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ టిక్కెట్టు కేటాయిస్తే పోటీ చేస్తానని  వికాస్ రావు  పార్టీలో చేరిన సమయంలో  ప్రకటించారు.  వేములవాడ టిక్కెట్టు కోసం వికాస్ రావు తీవ్రంగా ప్రయత్నించారు. అంతే పట్టుదలతో తుల ఉమ ఉన్నారు. తొలుత తుల ఉమ పేరును ప్రకటించినప్పటికీ  చివరికి వికాస్ రావుకే పార్టీ బీ ఫాం దక్కింది.పార్టీ నేతల ఆధిపత్యపోరు కారణంగానే  చివరి నిమిషంలోనే  అభ్యర్థుల పేర్లను మార్చాల్సిన పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

click me!