రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ స్థానాల నుండి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పోటీ చేస్తున్నందున కామారెడ్డి నుండి కూడ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.
కామారెడ్డి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ప్రత్యేక హెలికాప్టర్ లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి రేవంత్ రెడ్డి కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో కలిసి రిటర్నరింగ్ అధికారి కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందించారు.
రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ , మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కర్టాటక మంత్రి బోస్ రాజు తదితరులు హాజరయ్యారు.
undefined
అంతకుముందు కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్ గ్రామస్తులు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు.ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు.
మిడ్ మానేర్ డ్యామ్ నిర్మాణంలో కొనాపూర్ గ్రామం ముంపునకు గురికావడంతో కేసీఆర్ పూర్వీకులు కొనాపూర్ నుండి చింతమడకకు వలసవెళ్లారు. తన పూర్వీకుల గ్రామం ఇక్కడే ఉన్నందున పోటీ చేయాలని కేసీఆర్ ను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. దీంతో తాను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ కామారెడ్డి నుండి బరిలోకి దిగుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
also read:నామినేషన్ వేసేందుకు వెళ్లిన షెట్కార్ కు షాక్: నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డికే కాంగ్రెస్ టిక్కెట్టు
కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి నుండి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నెల 6వ తేదీన కొడంగల్ లో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గతంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి షబ్బీర్ అలీ ప్రాతినిథ్యం వహించారు. కేసీఆర్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ స్థానంనుండి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో రేవంత్ రెడ్డి కోసం షబ్బీర్ అలీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కామారెడ్డితో పాటు నిజామాబాద్ అర్బన్ స్థానంలో కూడ షబ్బీర్ అలీ ప్రచారంలో పాల్గొంటున్నారు.
LIVE : "కాంగ్రెస్ విజయ భేరి యాత్ర "కామారెడ్డి లో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నామినేషన్
https://t.co/DGjbg8pUKg
అంతకుముందు కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కొనాపూర్ గ్రామస్తులు కొంత డబ్బులను విరాళాల రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు.ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈటల రాజేందర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. నిన్న హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.