Telangana Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్ పై‘చేయి’.. పుంజుకున్న బీజేపీ

By Mahesh KFirst Published Nov 30, 2023, 6:18 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రా సంస్థ వెల్లడించిన సర్వే ప్రకారం కాంగ్రెస్, బీజేపీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 56 స్థానాలను, బీఆర్ఎస్ 45 స్థానాలను, బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది.
 

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇప్పటికే పలు కీలక సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి. చాలా వరకు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వెలువడ్డాయి. ‘రాష్ట్రా’ సంస్థ విడుదల చేసిన సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంచనాలను చెప్పింది.

రాష్ట్రా సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 56 సీట్లను గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ 45 స్థానాల్లో విజయం సాధిస్తుంది. బీజేపీ అనూహ్యంగా ఒక స్థానం నుంచి పది స్థానాలకు పెరుగుతుంది. ఎంఐఎం పార్టీ 8 సీట్లను గెలుచుకుంటుంది. అంతిమంగా ఈ సంస్థ కూడా తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేసింది.

Latest Videos

తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 60 స్థానాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం 60 సీట్లు ఏ పార్టీ కూడా గెలుచుకోవడం లేదు. దీంతో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే చెప్పింది. 

Also Read: Telangana Exit Polls: తెలంగాణలో హంగ్.. కాంగ్రెస్ విజృంభణ

సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం.. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. కొత్త రాష్ట్రంలో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 48 సీట్లతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పింది. బీజేపీకి 10 సీట్లు, ఎంఐఎంకు 5 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

click me!