Jan Ki Baat SURVEY ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పినప్పటికీ.. బీజేపీ కింగ్ మేకర్‌గా మారే అవకాశాలు వున్నాయని పేర్కొంది. కాంగ్రెస్‌కు 48 నుంచి 64 స్థానాలు, బీఆర్ఎస్‌కు 40 నుంచి 55 సీట్లు, బీజేపీకి 7 నుంచి 13 సీట్లు, ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ అంచనా వేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లలో వున్న ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2,290 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా వున్నారు. దాదాపు 68 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు, ఓటములను వారే శాసించనున్నారు.