Rapido: పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఎలా పొందాలి?

By Mahesh K  |  First Published Nov 28, 2023, 3:02 PM IST

హైదరాబాద్ ఓటర్లకు ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని తెలిపింది. ఈ సౌకర్యాన్ని ఎలా పొందాలి?
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైడ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోజు (నవంబర్ 30వ తేదీ) పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఓటర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ర్యాపిడో ప్రకటించింది. హైదరాబాద్‌లోని సుమారు 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళ్లుతామని నిన్న ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ర్యాపిడో తెలిపింది.

ఈ సౌకర్యాన్ని ఎలా పొందాలి?

Latest Videos

undefined

తెలంగాణ ఎన్నికల రోజున ఉచిత ర్యాపిడో ప్రయాణం సౌకర్యాన్ని హైదరాబాద్‌లోని ఓటర్లు పొందవచ్చు. అందుకోసం వారు వన్ టైమ్ కోడ్ VOTENOW అనే కోడ్‌ను ర్యాపిడో యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ ఎంటర్ చేస్తే ఫ్రీ రైడ్ ఎనేబుల్ అవుతుంది.

Also Read: Hyderabad: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు

పోలింగ్ బూత్ ఇలా కనుక్కోవచ్చు:

తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రాన్ని వెతుక్కోవడానికి అధికారిక వెబ్ సైట్ నేషనల్ వోటర్స్ సర్వీసెస్ పోర్టల్‌(ఇక్కడ క్లిక్ చేయండి)ను సందర్శించాలి. అందులో పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి సెర్చ్ అంటే.. వారు ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం వివరాలను చూపిస్తుంది. ఈ వివరాల ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి రావొచ్చు.

click me!