Narendra Modi...చేగూరు కన్హా శాంతివనం: సందర్శించిన ప్రధాని మోడీ

By narsimha lode  |  First Published Nov 26, 2023, 12:30 PM IST

రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ సందర్శించారు.  తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం  ప్రధాన మంత్రి నిన్న  తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు.  


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కన్హా  శాంతివనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు సందర్శించారు.నందిగామ మండలం చేగూరు వద్ద ఉన్న శాంతి వనాన్ని  మోడీ సందర్శించారు.

 

Addressing a programme at Kanha Shanti Vanam in Telangana. https://t.co/lXTtuht3gT

— Narendra Modi (@narendramodi)

Latest Videos

undefined

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి  ధ్యానగురువు  కమలేష్ డి పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  బాబూజీ మహారాజ్ స్మారక ఫలకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి  నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చారు.  ఇవాళ  చేగూరులోని  శాంతి వనాన్ని ఆయన  సందర్శించారు. కమలేష్ డీ పటేల్  మోడీకి స్వాగతం పలికారు.  కన్హా శాంతి వనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపు ధ్యానం చేశారు.
హర్ట్‌పుల్‌నెస్ ఇనిస్టిట్యూట్ ధ్యాన మందిరంలో ప్రధాన మంత్రి మోడీ  ప్రసంగించారు.

సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్ర 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.బాబుజీ మహారాజ్ బోధనలు ఆదర్శప్రాయమని మోడీ పేర్కొన్నారు. కాలం మారుతుంది. కాలంతో పాటు భారత్ కూడ  మార్పు చెందుతుందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

దేశం ఆర్ధికంగా, సంస్కృతి పరంగా  అభివృద్ది చెందుతుందని ప్రధాన మంత్రి మోడీ గుర్తు చేశారు.చాలా కాలంగా ఇక్కడికి రావాలనుకుంటున్నా... కానీ అనేక కారణాలతో రాలేక పోయినట్టుగా  మోడీ చెప్పారు.యోగులు,సాధువుల పరంపరను శాంతివనం ముందుకు తీసుకెళ్తుందని  మోడీ  అభిప్రాయపడ్డారు. నిజమైన సాధకుడికి కావాల్సిన యోగం, ధ్యానం శాంతివనం అందిస్తుందని ప్రధాని చెప్పారు.

 మన ఘన వారసత్వాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ  పేర్కొన్నారు.దేశ అభివృద్ది కోసం నాలుగు విషయాలపై  మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మోడీ  చెప్పారు.మహిళా శక్తి,  యువశక్తి, శ్రమశక్తి, ఉద్యమశక్తిపై దృష్టి పెట్టాలని మోడీ సూచించారు.యువత నెగిటివిటీ, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మోడీ సూచించారు.


 

click me!