Rahul Gandhi : మళ్లీ బిఆర్ఎస్ అస్త్రం తెలంగాణ సెంటిమెంటే... రాహుల్ పై ఇలా ప్రయోగించారుగా..! (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 17, 2023, 12:29 PM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ను తెలంగాణ ద్రోహిగా ప్రజలముందు వుంచే ప్రయత్నం చేస్తోంది బిఆర్ఎస్.  ఇందులో భాగంగా  నేడు రాహుల్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోస్టర్లు, బ్యానర్లు వెలిసాయి. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది... దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబసభ్యుల ప్రచారాన్నే నమ్ముకుంటే జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ లు డిల్లీ పెద్దలను రంగంలోకి దింపుతున్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజూ రెండుమూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, బిజెపి ప్రధాని మోదీ, అమిత్ షా లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇలా డిల్లీ నుండి హైదరాబాద్ బాటపట్టిన జాతీయ స్థాయి నాయకులకు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తోంది బిఆర్ఎస్. 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంకోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏనాడైనా తలచుకున్నాయా? అని బిఆర్ఎస్ నేతలు నిలదీస్తూ వస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించకుండా కొందరు... ప్రకటించి వెనక్కి తగ్గి మరికొందరు అమరుల ఆత్మబలిదానాలు కాంగ్రెస్ కారణమయ్యిందని అంటున్నారు. తెలంగాణ బిడ్డల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు... ఎవరూ ఊరికే ఇవ్వలేదని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ను తెలంగాణ ద్రోహిగా ప్రజలముందు వుంచే ప్రయత్నం చేస్తోంది బిఆర్ఎస్. 

Latest Videos

undefined

వీడియో

తెలంగాణలో ఎన్నికల ప్రచారంకోసం కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ సెటైరికల్ బ్యానర్లను ఏర్పాటుచేసారు. తెలంగాణ అమరవీరులతో రాహుల్ గాంధీ ఫోటోతో శంషాబాద్ పరిసరాల్లో బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసారు. 

Read More  తెలంగాణ ముఖ్యమంత్రి ఆనంద్ అట... అన్నది స్వయంగా కేటీఆరే..!

ఇలా గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసింది. తమ బిడ్డల ప్రాణాలు బలవడానికి కారణమైన వారు రాష్ట్రానికి వస్తున్నారని... వారి మాయమాటలు నమ్మి మోసపోయి మళ్లీ గోసపడొద్దని బిఆర్ఎస్ నాయకులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటిలాగే పాలన స్వరాష్ట్రం నుండే సాగేలా చూడాలని.. డిల్లీనుండి సాగించేవారికి అధికారం కట్టబెట్టవద్దని కోరుతున్నారు. 

ఇక రాహుల్ గాంధీ పర్యటన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వెలిసిన ప్లెక్సీలపై కాంగ్రెస్ శ్రేణులు గరం అవుతున్నారు. ఎన్నికలు రాగానే బిఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్, అమరవీరులు గుర్తుకువస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ చీఫ్ ట్రిక్స్ పనిచేసాయి... కానీ ఈసారి అలా జరగదని అన్నారు. బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటు బిఆర్ఎస్ పనేనని అంటున్నారు. 

click me!