తెలంగాణ ముఖ్యమంత్రి ఆనంద్ అట... అన్నది స్వయంగా కేటీఆరే..! 

By Arun Kumar P  |  First Published Nov 17, 2023, 11:23 AM IST

ఎంతటి వాగ్దాటి కలిగిన నాయకుడైన అప్పుడప్పుడు తడబడుతుంటాడు... అలా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా తడబడి ఏకంగా రాష్ట్ర సీఎంనే మార్చేసారు. 


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతటి మాటకారో అందరికీ తెలుసు. ఏ విషయంపై అయినా... తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ ఏ బాషలో అయినా అనర్గళంగా మాట్లాడగలడు కేసీఆర్. ఆయన తనయుడు కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు. అయితే ఎంతటి వాగ్దాటి కలిగిన నాయకులకైనా ఒక్కోసారి మాటలు తడబడతుంటాయి. ఇలాగే ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా కేటీఆర్ కూడా తడబడ్డాడు. మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరేబదులు ఇంకో నాయకుడిని సీఎం చేయాలని కోరారు. వెంటనే తప్పు గుర్తించిన కేటీఆర్ తన మాటలను సవరించుకున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగానే వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థి మెతుకు ఆనంద్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఎన్నికలు రాగానే కొందరికి ప్రజలు గుర్తుకువస్తారు... కానీ బిఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ ప్రజల్లోనే వుంటారన్నారు.  ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు... ఎవరు ఏం చేసారో చూసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అనేబదులు ఆనంద్ సీఎం అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు. వెంటనే సవరించుకుని మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. 

Latest Videos

undefined

ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బిజెపి లపై కేటీఆర్ ధ్వజమెత్తారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న బిఆర్ఎస్ కు రైతాంగం మద్దతుగా నిలవాలని అన్నారు. కరెంట్ కావాలో లేక కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తమను ఎదుర్కొనే దమ్ములేదు... అందువల్లే డిల్లీ, పక్కరాష్ట్రాల నుండి నాయకులను తెచ్చుకుంటున్నారని అన్నారు. ఎవరు వచ్చినా... ఎంత ప్రచారం చేసినా చివరకు ప్రజలు గెలిపించేది బిఆర్ఎస్ పార్టీనే అని కేటీఆర్ అన్నారు. 

Read More  Kalvakuntla Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి పదవి... కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే వృద్దులతో పాటు గృహిణులకు నెలకు రూ.3 వేల ఫించన్ ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని మహిళలు ఈ ఫించన్ కు అర్హులుగా పేర్కొన్నారు. కాబట్టి మహిళలు డిల్లీ పార్టీల మాయమాటలు నమ్మొద్దని... మీ కోసం ఆలోచిస్తున్న బిఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ కోరారు. 

click me!