తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో పోటీపడి మరీ వేలకు వేల ఓట్లు సాధించింది నోటా. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కంటే నోటా మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. చివరకు తెలంగాణ ప్రజల ఆశిస్సులతో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలిచింది. బిఆర్ఎస్, బిజెపి లతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. ఇక బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో మొదటిసారి పోటీచేసిన జనసేన పార్టీ మరీ దారుణంగా వుంది. ఎనిమిది చోట్ల పోటీచేసిన జనసేన పార్టీ డిపాజిట్లు కోల్పోయింది... కనీసం నోటాతో కూడా ఆ పార్టీ పోటీపడలేకపోయింది.
కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు డిల్లీ నుండి జాతీయ నాయకులకు తెచ్చుకుని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నాయి. ఇక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీని గెలిపించుకునేందుకు సుడిగాలి పర్యటనలు చేసారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కానీ ఏ ప్రచారం లేకుండానే వేలాది ఓట్లు సాధించి ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్ణయించింది నోటా. కొన్ని నియోజకవర్గాల్లో నోటాకు వచ్చిన ఓట్ల కంటే గెలిచిన అభ్యర్థుల మెజారిటీలు తక్కువగానే వున్నాయి. అయితే నోటాకు కాకుండా ఈ ఓట్లు పార్టీలకు పడితే గొలుపోటములు తారుమారు అయ్యేవి. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా పోటీ ఆసక్తికరంగా సాగింది.
undefined
తెలంగాణలో పోటీచేసిన కూకట్ పల్లి మినహా ఏ చోటా జనసేన పార్టీ గౌరవప్రదమైన ఓట్లు సాధించలేకపోయింది. జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చాలాచోట్ల నోటాకు వచ్చిన ఓట్లకంటే తక్కువగా వున్నాయి. నాగర్ కర్నూల్, కొత్తగూడెం వంటి చోట్ల జనసేన ఓట్లు కనీసం 2 వేలు కూడా దాటలేదు. కానీ నోటా మాత్రం కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గంలో ఏకంగా 4079 ఓట్లు సాధించింది. అలాగే మేడ్చల్ 3737, శేరిలింగంపల్లి 3,145, ఎల్బీ నగర్ 2,966, మల్కాజ్ గిరి 2,608, ఉప్పల్ 2,536, మహేశ్వరం 2031 ఓట్లు నోటాకు పడ్డాయి.
Read More పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే నయం..
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పోటీ కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ల మధ్య వుంది. కానీ వీటితో పోటీపడుతూ చాలా నియోజకవర్గాల్లో నోటా నాలుగోస్థానంలో నిలించింది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా 26 నియోజకవర్గాల్లో నోటా నాలుగో స్థానంలో నిలిస్తే... మరో 25 స్థానాల్లో ఐదో స్థానంలో నిలించింది. అంతేకాదు కొన్నిచోట్ల గెలుపోటములను సైతం నోటా నిర్ణయించింది.
గ్రేటర్ పరిధిలో నోటాకు ఏకంగా 44 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాలన్నింటిలో నోటాకు పడిన ఓట్లు 16,222... అలాగే మేడ్చల్ జిల్లాలో 15,418, రంగారెడ్డి జిల్లాలో 12,824 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇలా ప్రధాన పార్టీలకు దడపుట్టిస్తూ... ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను ఏకంగా ఓడిస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ప్రస్థానం సాగింది.