కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ లు కాదు... కేసీఆర్ అతన్ని సీఎం చేసినా ఆశ్చర్యంలేదు...: బండి సంజయ్

By Arun Kumar P  |  First Published Nov 20, 2023, 12:25 PM IST

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మనవడు హిమాన్షును ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యమేమీ లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 


కరీంనగర్ : ముఖ్యమంత్రి పదవి విషయంలో కేసీఆర్ కుటుంబసభ్యుల మధ్య వివాదం సాగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తనయుడు కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట... కానీ అలాచేస్తే ఎక్కడ అల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడోననే భయం వుందట. అలాగే కేసీఆర్ కూతురు కవితతో పాటు సంతోష్ రావు కూడా ముఖ్యమంత్రి పదవిపై కన్నేసినట్లు రాజకీయ ప్రచారం. ఇలా ఇప్పటికే కేసీఆర్ కుటుంబంలో ముగ్గురునలుగురు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నవేళ బిజెపి ఎంపి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

కరీంనగర్ రూరల్ మండలపరిధిలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ప్రచారం చేపట్టారు. ఇలా ఫకీర్ పేట గ్రామంలో ప్రచారం చేపట్టిన సంజయ్ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేసారు. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. కేసీఆర్ తో పాటు కొడుకు, కూతురు, మేనల్లుడు ఇలా అందరికీ రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. మనవడు హిమాన్షుకు మాత్రమే ఏ ఉద్యోగం లేదు... కేసీఆర్ అతడిని ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Latest Videos

undefined

ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్వయంగా కేటీఆర్ తెలిపారు. కానీ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. 

Read More  చిన్న చిన్న అసంతృప్తులు .. పక్కనబెట్టండి, బీఆర్ఎస్‌ను గెలిపించండి : ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి

ఇలా కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఈ విషయం ముందుగా గుర్తించిన కేసీఆర్ మేనల్లుడిని కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేసారట. కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినప్పుడే హరీష్ వర్గం రగిలిపోయింది... ఇక ముఖ్యమంత్రి పదవి ఇస్తే బిఆర్ఎస్ లో అలజడి ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

కానీ ఇటీవల ముఖ్యమంత్రి పదవిపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీని తిరిగి ఆధికారంలోకి తీసుకువచ్చేందుకే తాను పనిచేస్తున్నానని... ముఖ్యమంత్రిని కావాలని... అధికారం చెలాయించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మన పనితీరును బట్టి ప్రజలే పదవులు కట్టబెడతారని అన్నారు. తనకు కేటీఆర్ తో మంచి స్నేహం వుందని... అతడిని ముఖ్యమంత్రి చేస్తే తప్పకుండా అంగీకరిస్తానంటూ హరీష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా పదవుల కోసం గొడవలు పడే సంస్కృతి బిఆర్ఎస్ లో వుండదన్నారు. 
 
 

click me!