Karimnagar: నగదు కరువై ఆస్తి పత్రాలు పట్టుకుని తిరుగుతున్న అభ్యర్థులు.. కాసుల్లేకుండా క్యాంపెయిన్ కష్టమేగా!

By Mahesh K  |  First Published Nov 19, 2023, 6:24 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరు అభ్యర్థులు చేతిలో నగదు లేక ఆపసోపాలు పడుతున్నారు. నగదు కోసం ఆస్తి పత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. రియల్టర్లు, వ్యాపారుల చుట్టూ నగదు కోసం తిరుగుతున్నట్టు సమాచారం.
 


హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరు అభ్యర్థులు నగదు కోసం తండ్లాడుతున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లను నిర్వహించడానికి నగదు కోసం అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. కొందరు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రచారం చేపడుతుండగా.. మరికొందరు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నగదు లేక ఆస్తి పత్రాలు పట్టుకుని నగదు ఇచ్చే వారి చుట్టూ పచార్లు కొడుతున్నారు. రుణాలు ఇచ్చే వారి వద్దకు, రియల్టర్ల వద్దకు, వ్యాపారుల వద్దకు ఆస్తి పత్రాలతో వెళ్లుతున్నారు.

వారికి కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నప్పటికీ చేతిలో నగదు లేక అల్లాడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టడానికి నగదు లేదు. దీంతో ఆస్తులు తాకట్టు పెట్టి నగదు పొందాలని అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ పలువురు అభ్యర్థులు నగదు ఇచ్చే వారి కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.

Latest Videos

undefined

పాంప్లెట్లు ముద్రణ మొదలు సభలు, సమావేశాలకు ప్రజలను తీసుకురావడానికి డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేకుండా ఒక్క రోజు క్యాంపెయిన్ చేయడం కూడా అభ్యర్థులకు కష్టతరమైపోయింది.

Also Read: Maharashtra: భర్త ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడని భార్య ఆత్మహత్య.. అసలు కారణం ఇదీ

ఏ పార్టీ, ఏ అభ్యర్థి అనే తేడా లేకుండా ఎన్నికల క్యాంపెయిన్‌లో కొన్ని గంటలపాటు పాల్గొనడానికి ఒక్కొక్కరికి రూ. 200, రూ. 300 వరకు ఇస్తున్నారు. సాధారణంగా అభ్యర్థుల వారి వెంట 50 నుంచి 100 మందిని తీసుకెళ్లుతుంటారు. ఇక్కడ వారి వాహనాలకు ఇంధనం, బ్రేక్ ఫాస్ట్, మీల్స్ సహా ఇతర ఖర్చులను పార్టీ వర్కర్లకు పెట్టాల్సి వస్తున్నది. 

ఒక వేళ నియోజకవర్గస్థాయి సభ నిర్వహిస్తే, అందులో రాష్ట్రస్థాయి, ఇతర ముఖ్య నేతలు ప్రసంగించడానికి వస్తే సభను విజయవంతం చేయడానికి ఆ అభ్యర్థులు గ్రామాలు, మండలాల నుంచి పెద్ద మొత్తంలో జనాలను తీసుకురావల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడమే కాకుండా.. వారిని తీసుకువచ్చి, తీసుకువెళ్లడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం, వాటికి ఇంధన ఖర్చులు అందించాల్సి ఉంటున్నది. ఈ చెల్లింపులను నగదు రూపంలోనే జరుగుతాయి. కాబట్టి, ఇప్పుడు అభ్యర్థులు నగదు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

click me!