Narendra Modi..హైద్రాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుండి కాచిగూడ వరకు యాత్ర

By narsimha lodeFirst Published Nov 27, 2023, 5:42 PM IST
Highlights

మూడు రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తెలంగాణలో విస్తృతంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించారు.

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సోమవారంనాడు హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించారు.  ఇవాళ మధ్యాహ్నం రెండు ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు.   ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి  కాచిగూడ వరకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా నిలబడ్డ ప్రజలకు అభివాదం చేస్తూ  ప్రధానమంత్రి మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు.

Latest Videos

భారత్ మాతాకి జై, మోడీ మోడీ అంటూ బీజేపీ శ్రేణులు  నినాదాలు చేశారు. మోడీ వాహనానికి ముందుగా  బీజేపీ కార్యకర్తలు నృత్యాలు చేస్తూ  రోడ్ షోలో పాల్గొన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో ను పురస్కరించుకొని ఈ మార్గంలో  వెళ్లాల్సిన వాహనదారులను ప్రత్యామ్నాయమార్గాల ద్వారా వెళ్లాలని  ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  

మోడీ రోడ్ షో వెళ్లే మార్గంలో కేంద్ర బలగాలు మోహరించాయి.  ఈ రోడ్లను  కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మూడు కిలోమీటర్ల మార్గంలో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైసీఎంఏ చౌరస్తా  మీదుగా కాచిగూడ క్రాస్ రోడ్డు వరకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో  సాగింది.కాచిగూడ క్రాస్ రోడ్డు వద్ద వీరసావర్కర్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు.

బీజేపీ శ్రేణులు, మోడీ అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.  మోడీ రోడ్ షో నిర్వహిస్తున్న వాహనంపై  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు కూడ ఉన్నారు. 

 

also read:Narendra Modi...కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ మళ్లీ గద్దెనెక్కుతారు: కరీంనగర్‌లో నరేంద్ర మోడీ

ఈ రోడ్ షో ముగించుకున్న తర్వాత  హైద్రాబాద్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ  బెంగుళూరు బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మూడు రోజుల పాటు  సుడిగాలి పర్యటనలు చేశారు.  ప్రజలను ఆకర్షించేందుకు అప్పుడప్పుడు తెలుగులో కూడ  మోడీ ప్రసంగించారు. 

also read:Kamareddyలో ఉద్ధండుల పోరు:కేసీఆర్, రేవంత్ ...వెంకటరమణరెడ్డిలలో ఓటర్ల పట్టం ఎవరికో?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నేపథ్యంలో  ఈ రోడ్ షో మార్గంలోని మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు.   ఈ మార్గంలో వెళ్లే వాహనాలను ఇతర మార్గాల్లో  మళ్లించారు. రోడ్ షో ముగిసిన తర్వాత  మెట్రో రైల్వే స్టేషన్లను  తిరిగి తెరుస్తారు. 

click me!