
Bandi Sanjay : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల మంత్రులు, ముఖ్య నాయకులు ఓటమి చవిచూస్తుంటే.. ఏళ్ల తరబడి విజయానికి దూరంగా ఉన్న నాయకులు ఈ సారి గెలుపొందుతున్నారు. అయితే కరీంనగర్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఈ ఎన్నికల్లో గెలుపొందుతారని అందరూ భావించారు. కానీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో వెనకబడిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్ డేట్స్
15 రౌండ్ ముగిసే సమయానికి బండి సంజయ్ పై 10,036 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కరీంనగర్ లో కౌంటింగ్ మొదలుపెట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో బండి సంజయ్ ఆధిక్యం కనబర్చారు. అనంతరం ఈవీఎంలు ఫలితాలను లెక్కబెట్టారు.
మొదటి రౌండ్ లో గంగుల కమలాకర్ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లో మళ్లీ బండి సంజయ్ లీడ్ లోకి రాగా.. తరువాత గంగుల వచ్చారు. ఇలా 15వ రౌండ్ ముగిసే సరికి బండి సంజయ్ చాలా వెనకబడిపోయారు. 15 రౌండ్ లో బండిపై గంగుల 10,036 ఓట్ల ఆధిక్యం కనబర్చారు. అయితే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ఆ బీజేపీ ప్రకటించింది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ సీఎం అభ్యర్థి అని అందరూ భావించారు. కానీ ఆయన ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.